Wednesday, August 6, 2025

వన్యప్రాణులను సంహరించే వారిపై కఠిన చర్యలు – జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు : జిల్లా ఎస్పీ




అదిలాబాద్, రిపబ్లిక్ హిందుస్థాన్ : ఆదిలాబాద్ జిల్లాలో వన్యప్రాణుల సంహారం చేసే వేటగాళ్లపై కఠినంగా వ్యవహరించాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ ఆదేశాలతో ప్రత్యేక చర్యలు చేపట్టారు. జిల్లాలో ఒకేసారి 10 ప్రత్యేక బృందాలతో తనిఖీలు నిర్వహించగా, నాలుగు కేసులు నమోదు అయ్యాయి.



ఈ తనిఖీల్లో నిందితుల నుంచి డబుల్ బోర్ గన్, ఎయిర్ గన్, జింక తల, జింక కొమ్ములు, వేటకు ఉపయోగించే సామాగ్రి, కత్తులు, టార్చ్ లైట్లు, వైర్లు, బరిసెలు తదితర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు.

పట్టుబడిన నిందితుల వివరాలు:

1. షోయబ్ అఫ్జల్ (పంజేష, ఆదిలాబాద్ వన్ టౌన్)

2. షేక్ షరీఫ్ (గుట్కూరు, తాంసి)

3. ఆత్రం మారుతి (వగాపూర్, మావల)

4. ఆత్రం భీమ్రావు (వగాపూర్, మావల) .

నిందితుల వద్ద నుండి విభాగాలవారీగా స్వాధీనం చేసుకున్న వస్తువులు:

ఆదిలాబాద్ వన్ టౌన్ పరిధి:

డబుల్ బోర్ గన్, జింక తల, రెండు జింక కొమ్ములు, వేట సామాగ్రి, టార్గెట్ పేపర్లు, కత్తులు, టార్చ్ లైట్లు, మఫ్లర్, జాకెట్లు, షూస్, బ్యాగ్స్.


మావల పరిధి – ఆత్రం భీమ్రావు వద్ద:

50 మీటర్ల జె వైరు, 50 మీటర్ల నైలాన్ మెష్, వేట సామాగ్రి, ఈటె, ఎలక్ట్రిక్ వైరు.


మావల పరిధి – ఆత్రం మారుతి వద్ద:

60 మీటర్ల జె వైరు, వేట సామాగ్రి, ఎలక్ట్రిక్ వైరు, ఒక ఈటె.


తాంసి పరిధి:

ఒక ఎయిర్ గన్.



జిల్లాలో వన్యప్రాణులను చంపడం, వేటాడటం చట్టరీత్యా నేరమని, ఇలాంటి చర్యలు తీసుకున్న వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని ఎస్పీ హెచ్చరించారు.

వన్యప్రాణులను సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదని పేర్కొంటూ, అనుమానాస్పద చర్యలు గమనించినవారు డయల్ 100 లేదా 8712659973 నంబర్‌కు వాట్సాప్ ద్వారా సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు.

ఈ తనిఖీలలో కీలకపాత్ర పోషించిన వన్ టౌన్, మావల, తాంసి పోలీసు బృందాలను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డిఎస్పీ వై. జీవన్ రెడ్డి, వన్ టౌన్ ఇన్స్పెక్టర్ బి. సునీల్ కుమార్, మావల సీఐ కర్రె స్వామి, ఎస్సై ఇసాక్ తదితరులు పాల్గొన్నారు.


Discover more from republichindustan.in

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి