దొంగల వద్ద నుండి రూ.4 లక్షల నగదు, మొబైల్ ఫోన్ల స్వాధీనం
ఆదిలాబాద్ , రిపబ్లిక్ హిందుస్థాన్ :
మావల పోలీసులు ఇంటి దొంగతనాల కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి, రూ.4 లక్షల నగదు, మూడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మావల సీఐ కర్ర స్వామి తెలిపిన వివరాల ప్రకారం, నిందితులు తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడ్డారు.

ప్రధాన కేసు (క్రైం నం: 360/2024, సెక్షన్ 457, 380 ఐపీసీ) డిసెంబర్ 6, 2024 రాత్రి 8:00 గంటల నుంచి డిసెంబర్ 10, 2024 ఉదయం 4:00 గంటల మధ్య సప్తగిరి కాలనీ, ఆదిలాబాద్‌లో తహసిల్దార్ దుర్వా లక్ష్మన్ నివాసంలో దొంగతనం జరిగింది. దొంగిలించిన వస్తువులలో బంగారం, వెండి, రూ.50,000 నగదు ఉన్నాయి. మొత్తం ఆస్తి విలువ రూ.3,63,000గా అంచనా వేయబడింది.
ఉట్నూర్ మండలం శాంతినగర్ కి చెందిన మిస్త్రీ పనులు చేసే నిందితుడు A1 ) శిండే రాజా ,
బోయవాడు చెందిన డ్రైవర్ , A2) షేక్ అమీర్ హుస్సేన్ (29) , నార్నూర్ మండలంలోని తాడిహత్నుర్ కి చెందిన వ్యవసాయ పనులు చేసే A3) ఎరలే గోపి అలియాస్ గోపాల్ (27) దొంగలను పట్టుకొని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా విచారణలో నిందితులు సప్తగిరి కాలనీ దొంగతనంతో పాటు ఆదిలాబాద్ జిల్లాలో ఇతర కేసుల్లోనూ ప్రమేయం ఒప్పుకున్నారు. దొంగిలించిన బంగారం, వెండిని మహారాష్ట్రలోని నాందేడ్‌లో అమ్మినట్లు వెల్లడించారు.
స్వాధీనం చేసిన వస్తువులు:
– శిండే రాజా: రూ.3,60,000 నగదు, వివో స్మార్ట్ ఫోన్
– షేక్ అమీర్: రూ.20,000 నగదు, ఓప్పో స్మార్ట్ ఫోన్
– ఎరలే గోపి: రూ.20,000 నగదు, వివో స్మార్ట్ ఫోన్
నిందితుల క్రిమినల్ చరిత్ర
– శిండే రాజా, షేక్ అమీర్: క్రైం నం. 321/2024, 11/2025, 134/2025, 181/2025 (మావల పోలీస్ స్టేషన్), క్రైం నం. 253/2024 (ఉట్నూర్ పోలీస్ స్టేషన్)
– ఎరలే గోపి: క్రైం నం. 360/2024, 11/2025
నిందితులను ఆదిలాబాద్ ఫస్ట్ క్లాస్ న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచి, 15 రోజుల న్యాయ హిరాసత్‌కు రిమాండ్ చేశారు. ఈ అరెస్టులతో జిల్లాలో ఇంటి దొంగతనాలు అరికట్టేందుకు పోలీసులు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
Recent Comments