ప్రజలను మోసం చేసే వ్యక్తి అరెస్టు, రిమాండ్
• అనుమానస్పదంగా ప్రవర్తించడంతో పెట్రోలింగ్ సిబ్బంది విచారణ.
• దొంగలించిన వాహనంపై పోలీస్ అని రాసుకుని ఉన్న వ్యక్తి.
• పోలీసుల విచారణలో మొబైల్ ఫోన్లో పోలీసు యూనిఫామ్ తో ఉన్న ఫోటోలు లభ్యం.
• గుడిహత్నూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు, నిందితుడి అరెస్టు, రిమాండ్.
– ఇచ్చోడ సీఐ బండారి రాజు
ఆదిలాబాద్ జిల్లా : గుడిహత్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందికి అనుమానాస్పదంగా కనిపించిన ఒక వ్యక్తిని విచారించగా, ఆ వ్యక్తి నార్నూర్ కు చెందిన నిందితుడు కుడ్మెతే నాగరావ్(30) అని, అతనిని విచారించగా అతని మొబైల్ ఫోన్ లో పోలీసు యూనిఫామ్ ధరించి ఉన్నటువంటి తన ఫోటోలను ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేశాడని అతనిపై గుడిహత్నూర్ పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేసి, అరెస్టు చేసి రిమాండ్కు పంపడం జరిగిందని ఇచ్చోడా సిఐ బండారి రాజు తెలిపారు.

గురువారం గుడిహత్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుడిహత్నూర్ ఎక్స్ రోడ్ వద్ద నిందితుడు అనుమానాస్పదంగా ఉండగా అతనిని అరెస్టు చేసి విచారించగా, విచారణలో నిందితుడు తెలిపిన వివరాల ప్రకారం పోలీస్ డ్రెస్ ఉన్నటువంటి యూనిఫామ్ లో ఉన్న ఫోటోను జేబులో ఉంచుకొని మరియు వాట్సాప్ నందు ఆ ఫోటోని కనబడే విధంగా ఉంచుకొని, ప్రజల వద్ద డబ్బులు వసూలు చేశానని పేర్కొన్నాడని తెలిపారు.
నకిలీ పోలీసుగా ప్రవర్తిస్తూ ప్రజలను మోసం చేస్తున్న ఇతనిపై కఠిన చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. ఇతని వద్ద నుండి మోటార్ సైకిల్ ను స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గుడిహత్నూర్ ఎస్సై మధు కృష్ణ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Recent Comments