• మత్తు పదార్థాలకు అలవాటు పడి దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు యువకులు.
• దొంగతనం జరిగిన 24 గంటల్లోనే చేదించి నిందితులను పట్టుకున్న ఆదిలాబాద్ టు టౌన్ పోలీసులు.
• ఒక సెల్ ఫోన్,1 ఇంజక్షన్, మూడు టర్మిన్ ఇంజక్షన్ బాటిల్స్ (రెండు ఖాళీవి), ఒక మెడజోలం ఇంజక్షన్ కాళీ బాటిల్ స్వాధీనం.
• రైల్వే స్టేషన్ నందు ముగ్గురు నిందితులను పట్టుకున్న ఆదిలాబాద్ టూ టౌన్ పోలీసులు.
ఆదిలాబాద్ : ఆదివారం ఉదయం రెండు గంటల సమయంలో రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా రైల్వే స్టేషన్ నందు అనుమానిస్పదంగా ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం జరిగిందని ఆదిలాబాద్ టూ టౌన్ ఇన్స్పెక్టర్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వివరాలను వెల్లడించారు.
ఈ సందర్భంగా విచారించిన వ్యక్తులలో నిందితులు
1) మహమ్మద్ మోయిజ్ , న్యూ హౌసింగ్ బోర్డ్ కాలనీ రాంనగర్ ,
2) షేక్ సమీర్ , చిలుకూరు లక్ష్మీ నగర్ అదిలాబాద్ ,
3) షేక్ అబ్దుల్ ఫయాజ్ చిలుకూరు లక్ష్మీ నగర్ ఆదిలాబాద్ లను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
పైన తెలిపిన ముగ్గురు వ్యక్తులు మత్తుకు అలవాటు పడి తరచూ దొంగతనాలు చేస్తూ ఉంటారని తెలిపారు. ఈ సమయంలోనే ముగ్గురు కలిసి శనివారం ఉదయం రెండు గంటల సమయంలో రిమ్స్ హాస్పిటల్ పక్కనగల సాయి సేవ హాస్పిటల్ మెడికల్ షాప్ నందు అక్రమంగా ప్రవేశించి డెస్క్ లో గల ఒక మొబైల్ ఫోను మరియు 200 రూపాయలను నగదు, టర్మైన్ ఇంజక్షన్లు మూడు, మెడజాలం ఇంజక్షన్ ఒకటి దొంగలించి పారిపోయినారు అని తెలిపారు.
వీరందరికీ మత్తు పదార్థాలు సేవించే అలవాటు ఉన్నందున మత్తులో ఉండడానికి ఇలాంటి ఇంజక్షన్లను మత్తు పదార్థాలను దొంగలించినారని తెలిపారు. దొంగతనాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటూ 24 గంటల్లోనే దొంగలను అరెస్టు చేసి రిమాండ్కు పంపడం జరిగిందని తెలిపారు.
అందులోని మహమ్మద్ మోయిజ్ అనే వ్యక్తి 22వ తారీఖున ఒక ఇంట్లో దొంగతనానికి పాల్పడి మావల పోలీస్ స్టేషన్లో నందు కేసు నమోదు అయిందని తెలిపారు అదే విధంగా 23వ తారీఖున దస్నాపూర్ లో గల దుర్గామాత మందిరం నందు డబ్బులు దొంగతనం చేసినందుకుగాను ఒక కేసు నమోదు అయిందని అదేవిధంగా 28వ తారీఖున శ్రీ సాయి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అక్కనగల కిరాణా షాప్ నందు తాళం పగలగొట్టి కౌంటర్లో నుండి వెయ్యి రూపాయల నగదును దొంగలించడం జరిగిందని తెలిపారు. ఇతను పలు కేసులలో నిందితుడుగా ఉన్న విషయాన్ని తెలిపారు.
Recent Comments