Thursday, July 31, 2025

నకిలీ ఆధార్ కార్డులు, నివాస ధ్రువపత్రాలను తయారు చేసే ముఠా సభ్యుల అరెస్టు – ముగ్గురి రిమాండ్

*నకిలీ ఆధార్ కార్డులతో, నివాస ధ్రువపత్రాలతో కేంద్ర ప్రభుత్వ రక్షణ రంగాల్లో ఉద్యోగాలు సాధించిన ఇతర రాష్ట్రాల వ్యక్తులు , ఒక్కొక్కరి దగ్గర లక్ష వసూలు

*9 మంది అభ్యర్థులు నకిలీ పత్రాలతో కేంద్ర ప్రభుత్వ రక్షణ రంగ ఉద్యోగలను తెలంగాణ కోటాలో సాధించారు.

*ఫోర్జరీ చీటింగ్ చేసి నకిలీ పత్రాలను సృష్టించిన 12 మంది నిందితులు ,  ముగ్గురి రిమాండ్

– ఉట్నూర్ ఎఎస్పి కాజల్ సింగ్ ఐపీఎస్

నకిలీ ఆధార్ కార్డులతో, నివాస ధ్రువపత్రాలతో కేంద్ర ప్రభుత్వ రక్షణ రంగాల్లో ఉద్యోగాలు సాధించిన ఇతర రాష్ట్రాల వ్యక్తులు , ఒక్కొక్కరి దగ్గర లక్షల వసూలు చేసిన నిందితుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినట్లు ఉట్నూర్ ఎఎస్పి కాజల్ సింగ్ ఐపీఎస్ తెలిపారు.

నిందితుడు షేక్ ఫరీద్
నిందితుడు షేక్ కలీం
నిందితుడు జాదవ్ గజానంద్



ఈ సందర్భంగా ఉట్నూర్ ఎఎస్పి కాజల్ సింగ్ కేసు వివరాలు వెల్లడించారు.

A4) షేక్ కలీం(34) s/o అబ్దుల్ రషీద్, ఇస్లాంపూర్, ఇచ్చోడ మండలం.
A5) షేక్ ఫరీద్ (59) s/o నజీర్ మొహమ్మద్, ఇస్లాంపూర్ గ్రామం ఇచ్చోడ మండలం.
A6) జాదవ్ గజానంద్(35) s/o కిషన్, ఇస్లాంపూర్ గ్రామం ఇచ్చోడ మండలం.

*క్రైం నం:* 131/2025 U/Sec 318(4), 335, 338, 340(2), 308(2) & 238 BNS ఇచ్చోడ పోలీస్ స్టేషన్

*వివరాలలో
ఉట్నూర్ ఎఎస్పి కాజల్ సింగ్ ఐపీఎస్ తెలిపిన వివరాల ప్రకారం, ఇచ్చోడా పోలీస్ స్టేషన్ నందు తేదీ 25 రోజున సహని సూరజ్ అను వ్యక్తి ఇస్లాం నగర్ గ్రామము, అని తప్పుడు నివాస ధ్రువీకరణ సర్టిఫికెట్ సృష్టించి సిఐఎస్ఎఫ్ నందు ఉద్యోగం సాధించాడు.

పోలీసు వెరిఫికేషన్ లో భాగంగా అతన్ని చిరునామా తప్పుగా తేలింది. అయితే అతను వాస్తవంగా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు. పేర్కొన్న ఇంటి నెంబర్ 48-2-2, ఇస్లాం నగర్ ఇంటి నంబరు సరిగా లేదన్న తర్వాత, వివిధ కోణాలలో విచారించగా తెలిసిన విషయం ఏమి అనగా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 9 మంది ఇచ్చోడా నందు కొందరూ వ్యక్తులను సంప్రదించి వారికి ఆధార్ కార్డు మరియు నివాస ధ్రువీకరణ పత్రాలు కావలసిందిగా ఒక్కొక్కరికి చొప్పున లక్ష రూపాయలు చొప్పున మాట్లాడుకుని, మొదటగా దీపక్ తివారి అనునతడు ఆధార్ కార్డు రూ 4000 లకు చేసి, నివాస ధ్రువీకరణ పత్రంపై పంచాయతీ సెక్రెటరీ వద్దకు వెళ్లగా, పంచాయతీ సెక్రటరీ గ్రామస్తులు కాదని సంతకం చేయలేదు,

దీన్ని దృష్టిలో పెట్టుకొని, ఇస్లామ్నగర్ మాజీ సర్పంచ్ భర్త – షేక్ ఫరీద్ మరియు షేక్ ఖలీం కలిసి, పంచాయతీ కార్యదర్శి సంతకం ఫోర్జరీ చేసి, మీ సేవలో అప్లై చేసి తప్పుడు రెసిడెన్స్ సర్టిఫికేట్ పొందారు.

దీపక్ తివారీ ఉద్యోగంలో చేరిన తర్వాత మిగిలిన 8 మంది కూడా ఇలానే చేసి, మీ సేవలో అప్లై చేశారు. సర్టిఫికెట్లను వెరిఫై చేసినప్పుడు వారు ఇస్లామ్నగర్ వారికి కాదని నిర్ధారణ అయ్యింది.

అయినప్పటికీ షేక్ ఫరీద్ మరియు షేక్ ఖలీం కలిసి మిగిలిన వారికి కూడా తప్పుడు రెసిడెన్షియల్ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డులు సృష్టించి ఇచ్చారు. దీనికిగాను మొత్తం రూ. 9 లక్షలకు ఒప్పందమయ్యి, ఇందులో రూ. 3 లక్షలు ఈ ఇద్దరికి వచ్చినట్టు తెలిపారు. మిగిలిన రూ. 6 లక్షలు ఉత్తర ప్రదేశ్‌లోని హుర్లిక్ వద్ద ఉన్నట్టు సమాచారం.

ఈ విషయం తెలుసుకున్న జాధవ్ గజానంద్ (ఇస్లామ్నగర్ వాసి) వీరిని బెదిరించి డబ్బు కొట్టడానికి ప్రయత్నించగా, షేక్ ఖలీం మరియు ఫరీద్ అతనికి రూ. 20,000/- ఇచ్చారు. తప్పుడు పత్రాలు తయారు చేసిన షేక్ ఫరీద్, షేక్ ఖలీం మరియు ఈ విషయం తెలిసినప్పటికీ దాచి డబ్బులు తీసుకున్న జాధవ్ గజానంద్‌ను 28.06.2025న రిమాండ్‌కు పంపించడమైనది.

నిందితులు ఇతర రాష్ట్రాల వారికి ఆ సర్టిఫికెట్లను అందజేసి కేంద్ర ప్రభుత్వ రక్షణ రంగాలలో ఉద్యోగాలు వచ్చే విధంగా ప్రోత్సహించినారు. ఈ నకిలీ సర్టిఫికెట్లతో వారందరూ ఉద్యోగాలు సాధించి, ప్రస్తుతం ఉద్యోగాలు నిర్వహిస్తున్నారు. విచారణ వారిపై కూడా కొనసాగుతుందని, మిగిలిన విషయాలు త్వరలో తెలియజేస్తానని ఉట్నూర్ ఎఎస్పి కాజల్ సింగ్ ఐపీఎస్ తెలిపారు. పాత్రికా సమావేశంలో ఏఎస్పీ తో పాటుగా ఇచ్చోడా సీఐ బండారి రాజు, ఎస్ఐ వి విష్ణువర్ధన్ పాల్గొన్నారు.


Discover more from republichindustan.in

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి