ఆదిలాబాద్ : ఆదివాసీ నాయక్ పోడ్ సామాజిక వర్గానికి చెందిన పెద్ది రవినీ ఆదివాసి నాయక్ పోడ్ హక్కుల పరిరక్షణ కమిటీ ఆదిలాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూన్నట్లు రాష్ట్ర అధ్యక్షులు గంజి రాజన్న మరియు ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు గుడిపేల్లి భీమన్న నియామక పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా స్థాయి బాధ్యతలను పెద్ది రవి అప్పగిస్తూ నియామక పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ సంఘం నాయకులు, సభ్యులు పాల్గొని, పెద్ది రవి నియామకాన్ని స్వాగతించారు.
పెద్ది రవి నాయక్ పోడ్ ఆదివాసీ సమాజ ఉన్నతి కోసం కృషి చేస్తూ, జిల్లాలో సామాజిక, ఆర్థిక సమస్యల పరిష్కారానికి పాటుపడతారని నాయకులు ఆకాంక్షించారు. ఈ నియామకం నాయక్ పోడ్ ఆదివాసీ సమాజంలో కొత్త ఉత్తేజాన్ని నింపుతుందని, సమాజ సంక్షేమానికి ఊపిరిలా పనిచేస్తుందని గంజి రాజన్న తెలిపారు.
ఈ నియామకంతో ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీ నాయక్ పోడ్ సమాజం బలోపేతం కానుందని, సమాజ సేవలో పెద్ది రవి కీలక పాత్ర పోషిస్తారని గుడిపేల్లి భీమన్న వ్యాఖ్యానించారు.
Recent Comments