- కేసు లో ఉన్న ఎడ్లను అనధికారికంగా, దుర్వినియోగం చేస్తే గోశాల యజమానులపై కఠిన చర్యలు – ఉట్నూర్ ఎఎస్పి కాజల్ సింగ్ ఐపీఎస్*
- గోషాల యజమానులకు కోర్టు ఆధీనంలో, కేసులో ఉన్న ఎడ్లను జాగ్రత్తగా కాపాడాలి అని సూచన.
రిపబ్లిక్ హిందూస్థాన్, ఆదిలాబాద్ / గుడిహత్నూర్ :
క్రైమ్ నెంబర్ 51 /25 చెందిన కేసులో 15 ఎడ్లను కామదేను గోశాలకు పంపగా, కామదేను గోశాల గోశాల యజమాని ఆర్యన్, నిర్వాహకుడు రాజు అందులోని 11 ఎడ్లను ఇతరులకు అనధికారికంగా, దుర్వినియోగం చేసి ఇవ్వడం జరిగిందని ఉట్నూర్ ఎఎస్పి కాజల్ సింగ్ ఐపీఎస్ తెలిపారు. ఈ విషయంపై గుడియత్నూర్ పోలీస్ స్టేషన్ నందు సుమోటో గా కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు.A1 ఆర్యన్ మరియు A2 రాజు పై క్రైమ్ నెంబర్ 80/25 తో అండర్ సెక్షన్ 316(3), 314 బిఎన్ఎస్ ప్రకారం కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు.
గోశాల యజమానులకు పలు సూచనలు చేస్తూ కోర్టు ద్వారా కానీ, కేసు నమోదు ద్వారా గోశాలలో తాత్కాలికంగా ఉంచిన ఎడ్లను అమ్మడం గానీ, ఇతర రైతులకు కిరాయికి గాని ఇవ్వడం చేయరాదని, వాటిని దుర్వినియోగం చేసుకోకుండా ఉండాలని సూచించారు. దుర్వినియోగం చేసిన, ఇతర చత్ర వ్యతిరేక పనులకు పాల్పడిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు.
Recent Comments