*సామాజిక సంఘాల ఆసాంఘిక కార్యకలాపాలపై నిఘా.* *రౌడీలు సత్ప్రవర్తనతో మెలగాలని సూచన.**మితిమీరిన రౌడీయిజం, వసూలు, బెదిరింపులు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవు.* *నేరడిగొండ పోలీస్ స్టేషన్లో జాదవ్ గోపాల్ పై కేసు నమోదు, అరెస్టు.*
Thank you for reading this post, don't forget to subscribe!
Neradigonda: సామాజిక సేవ పేరుతో రౌడీయిజం, వసూళ్లు, దోపిడి, బెదిరింపులకు, తనిఖీలకు పాల్పడిన వారిపై చట్టప్రకారం కఠినమైన చర్యలు తీసుకోబడతాయని ఇచ్చోడా సీఐ ఈ భీమేష్. ఈ సందర్భంగా నిన్న నేరడిగొండ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ అయిన జాదవ్ గోపాల్ (టైగర్ గ్రూప్ అధ్యక్షుడు) పై కేసు నమోదు చేసి, రిమాండ్కు పంపడం జరిగిందని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో రౌడీలు మరియు సామాజిక సంఘాల నాయకులు దోపిడీలకు యత్నించిన, వసూళ్లకు పాల్పడిన, బెదిరింపులకు పాల్పడిన వారిపై ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని, మితిమీరి ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలకు ప్రశాంత వాతావరణ కల్పించడమే లక్ష్యంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన ఐపిఎస్ ఆదేశాల మేరకు జిల్లా పోలీసులు విధులు నిర్వహిస్తారని తెలిపారు. నేరడిగొండ మండలం నందు పశువులు తరలిస్తున్న వాహనం ఆపి బెదిరింపులకు పాల్పడిన జాదవ్ గోపాల్ పై పశువులు తరలిస్తున్న వాహనం యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు నేరడిగొండ పోలీస్ స్టేషన్ నందు U/sec. 309(5), 324(2) r/w 3(5) BNS తొ కేసు నమోదు చేసి అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు. సామాజిక సేవ, సంఘాల పేరుతో ఎవరైనా ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు, వసూళ్లకు పాల్పడిన చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయని తెలిపారు.
Recent Comments