ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేలా పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తప్పవు.
గుడిహత్నూర్ పోలీస్ స్టేషన్ నందు క్రైమ్ నెంబర్ 64/25 తో కేసు నమోదు.
సోషల్ మీడియాలో ఆయుధాలు, కత్తులు, తల్వార్లతో పోస్టులు పెట్టిన వారిపై కేసులు నమోదు
ఆదిలాబాద్: గత రాత్రి గుడిహత్నూర్ మండలం నందు మహంకాళి ఆలయం వద్ద సునీల్ తరుణ్ అనే వ్యక్తుల పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఇద్దరు వ్యక్తులు ముండే వెంకట్ మరియు నరేష్ అనే వ్యక్తులు తల్వార్లతో సోషల్ మీడియాలో పోస్టులను పెట్టడం జరిగింది, ఈ తల్వార్ల తో దిగిన ఫోటోలు ప్రజలను భయభ్రాంతులను గురి చేసేలా ఉన్నందున గుడిహత్నూర్ పోలీస్ స్టేషన్ నందు వీరిద్దరిపై క్రైమ్ నెంబర్ 64/25 తో సెక్షన్ 25(1)(a) ఆమ్స్ యాక్ట్, 351 (2) BNS, 67 ఆఫ్ ఐ టి యాక్ట్ సెక్షన్ల కింద కేసును నమోదు చేయడం జరిగిందని తెలిపారు.
వీరు కత్తులతో తల్వార్లతో ఫోటోలు దిగి వాట్సాప్ నందు స్టేటస్ పెట్టుకుని ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగిందని ఇచ్చోడ సీఐ ఈ భీమేష్ తెలియజేశారు.
ఇలాంటి దుశ్చర్యలను ఎవరైనా పాల్పడినట్లయితే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు, అదేవిధంగా సర్కిల్ పరిధిలో ఎవరైనా కత్తులతో గాని ఆయుధాలతో గాని తల్వార్లతో గాని ఫోటోలు దిగి సోషల్ మీడియా నందు ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేలా ఎలాంటి పోస్టులు పెట్టిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఇలాంటి దృశ్యాలకు పాల్పడకుండా యువత ను తల్లిదండ్రులు కనిపెడుతూ ఉండాలని సూచించారు.


Recent Comments