
రిపబ్లిక్ హిందుస్థాన్, గుడిహత్నూర్ : బుధవారం రోజు గుడిహత్నూర్ మండల కేంద్రంలోని ఆదివాసీ విజ్ఞాన కేంద్ర ఆవరణలో మర్సకోల రాంజీ గోండ్ వర్ధంతి కార్యక్రమాన్ని ఆదివాసి సేన జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆదివాసి సేన ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు రాయిసిడం జంగు పటేల్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆదివాసీ సేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కోవ దౌలత్ రావు మొకాశి హాజరైనారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రిటిష్ వారిపై 1857 సిపాయిల తిరుగుబాటును ఆదర్శంగా తీసుకొని 1858 నుంచి 1859 వరకు రెండు సంవత్సరాల పాటు రాంజీ గోండ్ బ్రిటిష్ వారిపై పోరాటాన్ని కోనసాగించారని ప్రధానంగా ఆదివాసీ హక్కుల కోసం నీటికోరకు , భూమి & ఆటవి హక్కుల కోరకు, ప్రజల వద్ద నుంచి ఆధిక మొత్తంలో శిస్తులు వాసులు చేయటానికి వ్యతిరేకంగా, సామాజిక, సంస్కృతికతను రక్షించటానికి అయన చేసిన పోరాటం అమోఘం అన్నారు. బ్రిటిష్ ప్రభుత్వం తెలివిగా వ్యవహరించి రాంజీ గోండ్ తో పాటు ఆయన అనుచరులను నిర్మల్ ప్రాంతం వద్ద గల మర్రిచెట్టు వద్ద 9 ఎప్రిల్ 1860 సంవత్సరంలో ఊరితిసి చంపేయడం చాలా బాధాకరమన్నారు. ఆయన ఒక ప్రణాళిక ప్రకారం తన పోరాటాన్ని కొనసాగించారు. ఆయన పోరాట విధానాన్ని అనుసారిస్తూ నేటి ప్రభుత్వాలు మన హక్కులు, చట్టాలను అమలు పరిచే విధంగా ఉద్యమాలు చేయాలన్నారు, పోరాటాల విషయంలో ఆయనను స్పూర్తి తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి సేన మంచిర్యాల జిల్లా అధ్యక్షులు పేందోర్ శ్రీనివాస్, ఆదివాసి ఎంప్లాయిస్ ఫెడరేషన్ జిల్లా కన్వీనర్ కుంరం దశరత్, ఆదివాసీ సేన ఆదిలాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి తోడషం లక్ష్మణ్, జిల్లా కోశాధికారి మందడి లక్ష్మన్, వేడ్మ చంపత్ రావు, ఆదివాసి సేన గుడిహత్నూర్ మండల అధ్యక్షులు సేడ్మకి భీంరావ్,జన్నరం మండల అధ్యక్షులు దుర్వ యశ్వంత్, గుడిహత్నూర్ మండల కార్యదర్శి ఉయిక శ్యాంరావు, ఇంద్రవెల్లి మండల కార్యదర్శి సేడ్మకి కాశీరం, పెందోర్ గోవింద్, తోడషం రమేష్, మడవి లాల్ షావ్, సలాం జాకు, సోయం విజయ్ కుమార్,పెందోర్ ఆనిల్ కుమార్, కుమ్ర భారత్ , ఆత్రం రాజు, మడవి రాము, కేశవ్, లవాన్ తదితరులు పాల్గొన్నారు
Thank you for reading this post, don't forget to subscribe!
Recent Comments