వసుళ్ళకు పాల్పడిన ఎడల పోలీసు కేసులను నమోదు చేయబడతాయని హెచ్చరించారు.
Thank you for reading this post, don't forget to subscribe!ఇసుక ట్రాక్టర్ల వద్ద వసూళ్లకు, కళ్ళు దుకాణాల ఏర్పాటుకు వీడీసీలకు అధికారం లేదు.
అదిలాబాద్: వీడిసిలు గ్రామ అభివృద్ధి పేరుతో ఎలాంటి వసూళ్లకు పాల్పడరాదని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ ఆదేశించారని ఆదిలాబాద్ డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి తెలిపారు. బుధవారం డిఎస్పి కార్యాలయం నుండి ఒక పత్రిక ప్రకటన విడుదల చేస్తూ, విడిసి లకు ఎలాంటి అధికారిక గుర్తింపు లేదని తెలిపారు. విడీసీలు గ్రామ అభివృద్ధి పేరుతో ఎలాంటి వసూళ్లకు పాల్పడిన యెడల వారిపై చట్టప్రకారం కేసులు నమోదు చేయబడతాయని హెచ్చరించారు. బేల మండలం సాంగిడి గ్రామం నందు జైనథ్ మండలం సాంగ్వి గ్రామాల నందు ఇసుక ట్రాక్టర్ల వద్ద డబ్బులు వసూలు చేసిన వీడీసీ లపై కేసులు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. విడిసి లు చట్ట వ్యతిరేకంగా ఇసుక ట్రాక్టర్ల వద్ద వసూలు, కళ్ళు దుకాణాల ఏర్పాటుకు నిర్వహణకు అనుమతులు, బెల్టు షాపుల నిర్వహణకు అనుమతులు ఇవ్వడం లాంటివి చేయకూడదని అదిలాబాద్ డిఎస్పీ తెలిపారు. కళ్ళు దుకాణాల అనుమతులు ఎక్సైజ్ శాఖ వారు ఇచ్చిన తర్వాతనే నిర్వహించుకోవాలని తెలిపారు. విడిసి వారు అనుమతులు ఇచ్చినా చట్ట వ్యతిరేకం అని తెలిపారు.
Recent Comments