• గురుకులాలు ఆశ్రమ పాఠశాలలకు మహర్దశ వచ్చింది రేవంత్ రెడ్డి సర్కారు వచ్చినాకే… • హాస్టల్లో మౌలిక వసతులు కల్పన, మేస్ చార్జీల పెంపు కాంగ్రెస్ ప్రభుత్వ హయం లోనే జరిగింది • ఉన్నత విలువలు కలిగిన విద్య, పౌష్టికాహారం రెసిడెన్షియల్ లలో అందుతుంది.. • కేటీఆర్ రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడం తప్ప సొంత తెలివితో మాట్లాడటం లేదు… • బోథ్ నియోజకవర్గ విద్యార్థి లోకానికి శాసనసభ్యులు క్షమాపణలు చెప్పాలి… • కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పసుల చంటి, బోథ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ భోడ్డు గంగారెడ్డి
అదిలాబాద్ : తెలంగాణా రాష్ట్ర ఉన్నత చట్టసభ అసెంబ్లీ సాక్షిగా బోథ్ నియోజకవర్గ శాసనసభ్యులు అనిల్ జాదవ్ వాస్తవ పరిస్థితులను కప్పిపెట్టి పూర్తి అబద్దాలను మాట్లాడుతూ విలువైన శాసనసభ సమయాన్ని వృధా చేయడమే కాకుండా, శాసనసభ్యులను మంత్రులను పక్కదోవ పట్టించే ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎన్నుకొని వికృత రాజకీయాలకు తెరలేపారని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పసుల చంటి, బోథ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ భోడ్డు గంగారెడ్డి పేర్కొన్నారు.
ఈ సందర్భంగా భోథ్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ 10 సంవత్సరాల బిఆర్ఎస్ పాలనలో సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలలో అరకొర వసతులు నడుమ వెళ్లదీయాల్సిన గడ్డు పరిస్థితులు విద్యార్థులు ఎదుర్కొన్నారని కానీ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కనీస మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ఆహ్లాదకర వాతావరణంలోనికి పలు గురుకులాలను మార్చామని, అదే కాకుండా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ వ్యవస్థ తీసుకువచ్చి నియోజకవర్గంలో దాదాపు 25 వేల మంది విద్యార్థులకు ప్రయోజనం కలిగే విధంగా నిర్మాణాలు జరగబోతున్నాయని వాటికి సరిపడా నిధులు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందని తెలుసుకోవాలని సూచించారు.
అసెంబ్లీలో మాట్లాడుతూ ఇచ్చోడ మండల కేంద్రంలో ఆశ్రమ పాఠశాలలో చనిపోయిన విద్యార్థి లాలిత్య పాముకాటుతో మృతి చెందిందని అబద్ధాలు మాట్లాడటం విచారకరమని పోస్టుమార్టం రిపోర్టు ప్రస్తుతానికి రాలేదని, ఇది ప్రజలను తప్పుదోవ పట్టించడమే కాక ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న ఆశ్రమ పాఠశాలల మీద నమ్మకం కోల్పోయే విధంగా మాట్లాడారని మాండిపడ్డారు.
వసతులు లేక పాఠశాలల గోడలు దుకుతున్న్నారని
మాట్లాడటం విడ్డూరమని ఆశ్రమ పాఠశాలలో, రెసిడెన్షియల్ పాఠశాలలో పేద ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాల పిల్లలే ఉంటారని వారిని అవమానపరిచినట్టేనని, నియోజకవర్గ విద్యార్థి లోకానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
తన శాసనసభ నియోజకవర్గంలో ఏ ఒక్కరోజు కూడా సంక్షేమ హాస్టల్లో భోజనం చేయడం కానీ, బస చేయడం కానీ తెలియని ఎమ్మెల్యే అసెంబ్లీ సాక్షిగా అవాకులు చెవాకులు పేలారని వాటిని మానుకోవాలని నియోజకవర్గ ప్రజల తరఫున తాము సూచిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గొర్ల రాజు యాదవ్, షేక్ షాకీర్,కేంద్రే మదవరావు,గడ్డల నారాయణ పలువురు నాయకులు పాల్గొన్నారు.
Recent Comments