బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ లో చేరిన బిజెపి మండల అధ్యక్షుడు సాబ్లే సంతోష్
గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే అనిల్ జాధవ్
బీజేపీ పార్టీలో అటు రాష్ట్ర స్థాయిలో , ఇటు మండల స్థాయిలో పార్టీలో పెరుగుతున్న ముసలం…
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : కేంద్ర అధికార పార్టీని తలదన్ని నెరడిగొండ మండల బిజెపి అధ్యక్షుడు సాబ్లే సంతోష్ మరియు ఆయన అనుచరులు దాదాపు 100 మంది తో ఆదివారం రోజు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాధవ్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా సాబ్లే సంతోష్ మాట్లాడుతూ కార్యకర్తలకు గుర్తించడంలో బిజెపి పార్టీ విఫలమైందని నమ్ముకున్న కార్యకర్తలకు తగిన ఫలితం కల్పించట్లేదని అన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై ప్రజలు తిరగపడుతున్నారని ఇక తెలంగాణ రాష్ట్రాన్ని మంచి చేయాలనే ఉద్యేశం ఉన్న ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని నియోజకవర్గానికి ఎమ్మెల్యేనే ద బాస్ ఉంటారని ఆయన ప్రమేయంతోనే నిధులు వస్తాయని బోథ్ నియోజకవర్గానికి వందల కోట్లతో అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యే అనిల్ జాధవ్ విజన్ మరియు క్రేజ్ చూసి బీఆర్ఎస్ పార్టీలో చేరానని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాధవ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను గుర్తిస్తుందని మీరు కూడా తగిన స్థానం అందిస్తుందని కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజలపై చేస్తున్న అరాచకాలను స్థానిక సంస్థల్లో ప్రజలకు చూపాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ : బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ గారి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ లో చేరిన ఆరేపల్లి మాజీ సర్పంచ్ మరియు గ్రామస్తులు
ఎమ్మెల్యే క్రేజ్ చూసే పార్టీలో చేరినం – ఆరేపల్లి గ్రామస్తులు
నెరడిగొండ మండలంలోని ఆరేపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు కమల్ సింగ్ బావమరిది మాజీ సర్పంచ్ రవీందర్ తో పాటు దాదాపు గ్రామం అంతా ఏకమై ఈరోజు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ ఆధ్వర్యంలో ఆదివారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే అనిల్ జాధవ్ గారు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ మాట్లాడుతూ బోథ్ నియోజకవర్గంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నకూడా ప్రభుత్వాన్ని ఒప్పించి కొట్లాడి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యే అనిల్ జాధవ్ చూసి కేసీఆర్ గారి పార్టీ తెలంగాణకు శ్రీరామ రక్ష అని అంగీకరించి పార్టీలో చేరామని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాధవ్ మాట్లాడుతూ అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడతాన్ని నన్ను నమ్మి పార్టీలో చేరిన గ్రామాన్ని అభివృద్ధి చేయడం నా బాధ్యత అని అన్నారు. కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, మాజీ ఎంపీపీ రాథోడ్ సజన్, జాధవ్ గణేష్, పిఏసీఎస్ చైర్మన్ నానక్ సింగ్, గులాబ్ సింగ్, గులాబ్, పవన్, దేవేందర్ రెడ్డి రాథోడ్ సురేందర్ తదితరులు ఉన్నారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments