*ఆదివాసి సేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కోవ దౌలత్ రావు మొకాశి*
ఆదిలాబాద్//తేది:27-01-2025:- ఏజెన్సీ ప్రాంతంలో– ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, నూతన రేషన్ కార్డులు, మరియు రైతు భరోసా వంటి నాలుగు పథకాల లబ్దిదారుల ఎంపికలో పేసా గ్రామసభలకు ముఖ్యంగా PESA Act- 1996 చట్టం మరియు నిబందనలు, LTR చట్టం, నిబంధనలు పాటించకుండా, గత నాలుగు రోజులుగా జనవరి 21 నుండి 24 వరకు ప్రజాపాలన పేరిట జరిగిన సాదారణ గ్రామసభలలో చదివి వినిపించిన, ప్రచురించిన అర్హుల జాబితాలలో భూబదాలయింపు నిరోధక చట్టం ఎల్.టి.ఆర్-1/59, 1/70, 1359 ఫస్లి చట్టాలకు విరుద్ధంగా ఉన్నటువంటి గిరిజనేతరుల పేర్లు కూడా జాభితాలో చేర్చారు. ఇది ఏజెన్సీ ప్రాంత చట్టాలకు విరుద్ధం అని *ఆదివాసి సేన రాష్ట్ర అధ్యక్షులు కోవా దౌలత్ రావు మోకాసి* వారు తెలిపారు. వారు మాట్లాడుతూ గౌ.రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం వారు కూడా ఆదివాసీ సేన సంఘం తరుపున వేసిన గృహలక్ష్మి పథకం కేసు విషయంలో W.P.29444 OF 2023 ద్వారా లబ్దిదారుల ఎంపిక, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు అనునది ఏజెన్సీ ప్రాంతాల్లో పెసా గ్రామసభల ద్వారా చేయాలని ఉత్తర్వులు కూడా ఇచ్చి ఉన్నారు.ఏజెన్సీ ప్రాంతంలో అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్దిదారుల ఎంపిక అనునది పేసా చట్టం మరియు నిబందనలు, భూబదాలయింపు నిరోధక చట్టం LTR-1/59, 1/70,1359 Falsi చట్టాలకు లోబడే జరగాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా అనర్హత కలిగిన గిరిజనేతరులను కూడా ఎంపిక చేసినారు. ఇలా అనర్హత గల గిరిజనేతరులను ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఎంపిక చేయడం వలన ఏజెన్సీ ప్రాంతంలో ప్రభుత్వమే అక్రమ వలసలను ప్రోత్సహించినట్లు అవతుంది అని ఆదివాసి సేన నాయకులూ ప్రభుత్వం మరియు అధికారుల తీరును తప్పుబట్టారు. ఇకనైనా పాలక ప్రభుత్వాలు, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు ఏజెన్సీ ప్రాంతంలో పథకాల అమలు విషయంలో ఏజెన్సీ ప్రాంత చట్టాలకు అనుగుణంగా మాత్రమే కార్యాచరణ ఉండాలి అని అలా కాని పక్షంలో తమ సంఘం అధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమoలో ఆదివాసి సేన ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు రాయిసిడం జంగు పటేల్, ఆదివాసీ విద్యార్థి సేన జిల్లా కన్వీనర్ కుంరం చత్రుఘన్ తదితరులు పాల్గొన్నారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments