*పట్టణంలో చైనా మాంజ పై ఆకస్మిక తనిఖీలు.*
*చైనా మజా వినియోగం అమ్మడం నిషేధం.*
*పట్టణంలో 50వేల విలువచేసే చైనా మాంజా స్వాధీనం.*
*ఒకరిపై ఆదిలాబాద్ ఒకటవ పట్టణం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు*
*నిషేధించిన చైనా మాంజాను అమ్మిన వారిపై కేసులు తప్పవు.*
*ఆదిలాబాద్ డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి.*
*ప్రజా జీవనానికి హానికరం కలిగించే చైనా మాంజా వినియోగం నిషేధం.*
ఆదిలాబాద్ :
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిషేధించిన చైనా మాంజా వినియోగం చట్టరీత్య నేరమని ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి తెలిపారు. ఈరోజు ఉదయం స్థానిక ఆదిలాబాద్ పట్టణంలో చైనా మాంజాను విక్రయిస్తున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు ఆదిలాబాద్ వన్ టౌన్ టూ టౌన్ ఇన్స్పెక్టర్లు మరియు సిబ్బంది సహకారంతో పలు దుకాణాలలో తనిఖీ చేయగా అశోక్ రోడ్ నందు గల లక్ష్మీ సీజనల్ షాప్ నందు ఓనర్ శ్రీనివాస్ వద్ద 50,000 విలువచేసే నిషేధిత చైనా మాంజ లభ్యమైనట్టు తనపై ఆదిలాబాద్ ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేస్తున్నట్లు వివరించారు. దుకాణాల యజమానులకు వర్తక వ్యాపారులకు నిషేధిత చైనా మాంజాను విక్రయించినట్లయితే వారిపై నూతన చట్టం ప్రకారం కేసులు నమోదు చేయబడతాయని హెచ్చరించారు. ప్రజా జీవన విధానానికి మరియు పశువులకు ఆపదను కలిగించే చైనా మాంజా వినియోగం ప్రమాదకరమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ ఒకటవ పట్టణ సీఐ సునీల్ రెండవ పట్టణ సీఐ కరుణాకర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Recent Comments