16 వ రోజుకు చేరిన సమ్మె…
రిపబ్లిక్ హిందుస్థాన్ , ఉట్నూర్ : ఉద్యోగ క్రమబద్ధీకరణ చేయాలని మరియు ఇతర డిమాండ్లతో సీఆర్టి లు గత కొన్ని రోజులుగా ధర్నా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉద్యోగ క్రమబద్ధీకరణ చేసి, 61 సంవత్సరాల ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.
బేసిక్ పే స్కేల్ తో కూడిన వేతనం తో పాటు సర్వీస్ రిజిస్టర్ ను కల్పించాలని (సమాన పని కి – సమాన వేతనం) డిమాండ్ చేశారు.
గ్రీన్ ఛానల్ ద్వారా ప్రతి నెల 1వ తేదీన జీతాలు చెల్లించాలనీ , మహిళలకు 180 రోజులు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు మరియు శిశు సంరక్షణ సెలవులు ఇవ్వాలనీ అన్నారు.
CRT లకు P F సౌకర్యం తో పాటు ఆరోగ్య భద్రత / ఆరోగ్య కార్డ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
విధి నిర్వహణ వ్యవధిలో మరణిస్తే మరణ బీమా – 10 లక్షలు ఇవ్వాలని కోరారు.
పదవీ విరమణ ప్రయోజనాలు – 30 లక్షలు ఇవ్వాలని అన్నారు. ఈ సందర్భంగా డిమాండ్ల సాధన కోసం అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు.
.
.
.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments