రిపబ్లిక్ హిందుస్థాన్ ,ఆదిలాబాద్ :
ఈ సందర్భంగా స్టోర్ రూమ్, కిచెన్, త్రాగునీటి ని, టాయిలెట్ , తదితర వాటిని పరిశీలించారు. స్టోర్ రూమ్ లో నిల్వ ఉంచిన సన్నబియ్యం, ఇతర సరుకుల నాణ్యతను, విద్యార్థుల కోసం వండిన భోజనాన్ని పరిశీలించి నిర్వాహకులకు కీలక సూచనలు చేశారు. ఆహార పదార్థాలను భద్రపరిచే విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, పరిశుభ్రమైన వాతావరణంలో భోజనం తయారు చేసేలా చూడాలన్నారు. కూరగాయలు, ఆహార పదార్థాలను ఎక్కడపడితే అక్కడ నేలపై ఉంచకుండా స్టీల్ డబ్బాలలో భద్రపర్చాలని, వాటిపై తప్పనిసరిగా మూతలు భిగించాలనీ, ఆహారం కలుషితం కాకుండా జాగ్రత్తలు పాటించాలని ప్రతిరోజూ భోజనం వండడానికి ముందే ఆహార పదార్థాలు నాణ్యతను క్షుణ్ణంగా పరిశీలించాలని, కాలం చెల్లిన పదార్థాలు వినియోగించకూడదని సూచించారు. భోజనం వండిన తరువాత కూడా విద్యార్థులకు వడ్డించడానికి ముందు రుచి చూడాలని నిర్వాహకులను ఆదేశించారు. నాసిరకమైన బియ్యం, నూనె, ఇతర సరుకులు సరఫరా జరగకుండా చూడాలని తెలిపారు.


Recent Comments