ఆదిలాబాద్ : జిల్లాల్లోని అన్ని ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులు వ్యాధుల బారిన పడకుండా, ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవాటు చేసేందుకు అంతే కాకుండా, విద్యార్థుల్లో ఆత్మ విశ్వాసం, సామాజిక నైపుణ్యాలు పెంపొందించడం కోసం రూపొందించిన కార్యక్రమమే ఆరోగ్య పాఠశాల అని జిల్లా పాలనాధికారి రాజర్షి షా ఆన్నారు.
మంగళవారం రిమ్స్ ఆసుపత్రి లోని ఆడిటోరియం లో ఏర్పాటు చేసిన ఆరోగ్య పాఠశాల కార్యక్రమాన్ని సంబంధిత అధికారులతో జిల్లా పాలనాధికారి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా పాలనాధికారి మాట్లాడుతూ ఈ కార్యక్రమం నవంబర్ 14 వ తేదీ నుండి అన్ని ఉన్నత పాఠశాలల్లో, KGBV, ఇంటర్ కళాశాలల్లో ప్రారంభం కావడం జరుగుతుందనీ, ఒక్కో వారం ఒక్కో అంశాన్ని అమలు చేయనున్నారనీ, 4 వారాల పాటు నిర్వహించే ఈ కార్యక్రమలో ప్రతి సోమవారం వ్యక్తిగత పరిశుభ్రత
ప్రతి మంగళవారం పోషకాహారం పై అవగాహన , ప్రతి బుధవారం ఒత్తిడి నివారించుకునే మార్గాలు,
ప్రతి గురువారం డ్రగ్స్ కు దూరంగా ఉండడం, ప్రతి శుక్రవారం కాలానుగత వ్యాధుల నివారణ,
ప్రతి శనివారం వ్యక్తిత్వ వికాసం
ఈ అంశాలపై విద్యార్థులకు అవగాహన కలిగించడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమం నిరంతరంగా కొనసాగేలా పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాధ్యత వహించాలని తెలియజేశారు. విద్యార్థులు ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే విద్యా నైపుణ్యాలను సాధించగలరని అందుకోసం ఈ కార్యక్రమం దోహద పడుతుందని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో RIMS డైరెక్టర్ రాథోడ్ జైసింగ్, DMHO నరేందర్ రాథోడ్, జిల్లా విద్యాశాఖ అధికారి ప్రణీత, జిల్లా సంక్షేమ అధికారి సబిత, స్త్రీ శిశు సంక్షేమ అధికారి మిల్కా, జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి రవీందర్, ప్రధానోపాధ్యాయులు, నోడల్ ఉపాధ్యాయులు KGBV, జూనియర్ కళాశాలల ప్రిన్సిపల్స్, విషయ నిపుణులు, తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పౌర సంబంధాల అధికారిణి అదిలాబాద్ గారి చే జారీ చేయనైనది.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments