రిపబ్లిక్ హిందుస్థాన్ నల్లబెల్లి: నల్లబెల్లి మండల కేంద్రంలోని ఫెర్టిలైజర్ షాపు ముందు నకిలీ మందులు ఇచ్చారని రైతుల ఆందోళన చేశారు. వివరాల్లోకి వెళ్తే కొండి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన రైతు ముద్దం యుగంధర్ రెండు ఎకరాల్లో మిర్చి పంట సాగు చేస్తున్నాడు నల్లబెల్లిలోని ఖాజా మైనుద్దీన్ ఫర్టిలైజర్ షాపు నుండి పురుగుమందులు తీసుకెళ్లి పంటకు పిచికారి చేయగా వారం తర్వాత మొక్కలు చనిపోవడం చూసి ఆందోళన చెందిన రైతు షాప్ కు వచ్చి అడగగా షాపు యజమాని పంటను పరిశీలించి కంపెనీ ప్రతినిధులను పిలిపించి న్యాయం చేస్తానని చెప్పినట్లు బాధిత రైతు తెలిపాడు.

గత 15 రోజులుగా ఈరోజు రేపు అని బాట వేస్తుండడంతో సోమవారం రోజు షాపు వద్దకు వచ్చి యజమాని కాళ్లు పట్టుకొని నాకు న్యాయం చేయాలని కోరగా షాపు యజమాని స్పందించకపోవడంతో షాప్ ముందు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్ఐ ప్రశాంత్ బాబు సంఘటన స్థలానికి చేరుకొని రైతులతో మాట్లాడి ఈ కేసు సిఐ దృష్టిలో ఉందని సీఐ కార్యాలయానికి వెళ్తే కచ్చితంగా న్యాయం జరుగుతుందని చెప్పడంతో రైతులు ఆందోళన విరమించి సీఐ కార్యాలయానికి వెళ్లడం జరిగింది.
Recent Comments