• ఆదివాసి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కోవ దౌలత్ రావు మొకాశి
రిపబ్లిక్ హిందుస్థాన్, గుడిహత్నూర్ : ఈ రోజు అదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలో గోండ్వనా రాయి సెంటర్ సార్మెడి పేందోర్ జైరాం ఆధ్వర్యంలో మండలంలోని మన్కపూర్ రాయి సెంటర్ నుంచి కాలినడకన గుడిహత్నూర్ మండల కేంద్రంలోని ఆర్టిసి బస్టాండ్ సమీపంలోని కుంరం భీం విగ్రహం వద్ద చేరుకోని ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాల ప్రకారం పూజాలు నిర్వహించి పూలమాలలతో నివాళులర్పించి ఘనంగా 84వ కుంరం భీం వర్ధంతి వేడుకలను నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆదివాసి సేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కోవ దౌలత్ రావు మొకాశి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏజెన్సీ ప్రాంతాల్లో అవలంబిస్తున్న ప్రవేటికరణ , సరళికరణ విధానాలు ఆదివాసుల అస్తిత్వాన్ని దెబ్బతిస్తుయని ఆయన అన్నారు.కుంరం భీం స్పూర్తితో ఆదివాసీ సమాజం మెల్కోని ఆదివాసి అస్తిత్వాన్ని కాపాడుకోనుటకై మారో పోరాటానికి సంసిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఏజెన్సీ ప్రాంతంలో అక్రమంగా చోరబడి, భూ ఆక్రమణలకు పాల్పడుతున్న గిరిజనేతరుల వలసలను అరికట్టాలని , కుంరం భీం పోరాట ఫలితంగా కల్పించబడిన రాజ్యాంగ పరమైన హక్కులను, చట్టాలను అమలు చేయడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం అయ్యాయని ఆయిన వాపోయారు.ఈ కార్యక్రమంలో తుడుం దెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పేందోర్ జలపతి,ఆదివాసి సేన ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు రాయిసిడం జంగు పటేల్, తుడుం దెబ్బ మండల అధ్యక్షులు కోవ భగవాన్, సార్ మేడి పేందోర్ జైరాం, ఆదివాసి సేన మండల అధ్యక్షులు సేడ్మకి భీంరావ్, ఆదివాసి నాయకులు ఉయిక లక్ష్మణ్, మేస్రం నాగ్ నాథ్, మాజీ జడ్పీటిసి బ్రహ్మానందం, కోవ జాలీం, తోడషం భూమ పటేల్, ఆత్రం భీం రావ్, పేందోర్ జగన్, పేందోర్ విశ్వనాథ్, పేందోర్ నాందేవ్, మర్సకోల నగేష్, సలాం జాకు మండలంలోని అన్ని ఆదివాసీ గ్రామాల పటేల్ లు తదితరులు పాల్గొన్నారు
Recent Comments