ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ ల జారీ కై పైలెట్ ప్రాజెక్టు లో భాగంగా అదిలాబాద్ రూరల్ లోహర గ్రామం లో అధికారులు నిర్వహిస్తున్న ఇంటింటి సర్వేను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా పాలనాధికారి రాజర్షి షా.
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :
గురువారం అదిలాబాద్ రూరల్ లోహార గ్రామం లో ఈ రోజు నుండి మొదలైన డిజిటల్ కార్డ్ ల family digital card జారీ కై పైలెట్ ప్రాజెక్టు ప్రోగ్రాం క్రింద చేపడుతున్న ప్రయోగాత్మక ఇంటింటి సర్వే లో భాగంగా జిల్లా పాలనాధికారి రాజర్షి షా ఆకస్మికంగా తనిఖీ చేసి ఇంటింటి సర్వే నిర్వహిస్తున్న తీరును పరిశీలించారు.
ఈ సందర్భంగా పైలెట్ ప్రాజెక్టు ప్రోగ్రాం లో ప్రతీ కుటుంబానికి సంబందించిన అందరి వివరాలు తప్పులు లేకుండా ఇచ్చిన ఫార్మట్ లో పూరించాలని, ఇంటి యజమాని గా మహిళా పేరు ఉండాలని, తదుపరి కుటుంబ సభ్యుల పేర్లు నమోదు చేయాలని ఆన్నారు. అనంతరం మొబైల్ ఫోన్ లో ఫొటో తీసుకోవాలని తెలిపారు.
సర్వేను పకడ్బందీగా తప్పులు లేకుండా కుటుంబం లో ఎంత మంది ఉన్నారో వారి వివరాలు నమోదు చేయాలని ఆన్నారు.
నీటి సమస్య ఉందని గ్రామస్తులు తెలపగా నీటి సమస్యను పరిష్కరిస్తామని అన్నారు.
ఈ సర్వేలో RDO వినోద్ కుమార్, ఎంపిడిఓ, సిబ్బంది , తదితరులు ఉన్నారు.
జిల్లా పౌర సంబంధాల అధికారి అదిలాబాద్ చే జారీ చేయనైనది.

Recent Comments