ఉట్నూర్ / ఆదిలాబాద్ : సెప్టెంబర్ 2 నుండి 10 వరకు జరిగిన మొదటి విడత శిక్షణలో 21 మంది వృత్తి కళాకారులు సర్టిఫికెట్స్ అందుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు గోడెం నగేష్, శాసన సభ్యులు వెడ్మ బొజ్జు, పాయల్ శంకర్ పాల్గొన్నారు. PM విశ్వకర్మ తొలి వార్షికోత్సవ వేడుకలు ఉట్నూర్ కేబీ కాంప్లెక్స్‌లోని పీఎంఆర్‌సీ సమావేశ మందిరంలో ఘనంగా జరిగాయి.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్లమెంట్ సభ్యులు గోడెం నగేశ్, శాసన సభ్యులు వెడ్మ బొజ్జు (ఖానాపూర్), పాయల్ శంకర్ (అదిలాబాద్), జిల్లా పాలనాధికారి రాజర్షి షా, విద్యానంద్ జాయింట్ డైరెక్టర్ RDSD హైదరాబాద్, సీతారాములు రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ వరంగల్, శ్రీనివాస్ రొడ్డ ప్రిన్సిపాల్ FAC ప్రభుత్వ ITI ఉట్నూర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వార్ధా, మహారాష్ట్ర నుంచి వర్చువల్‌గా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన LED తెర మీద ప్రధాన మంత్రి కార్యక్రమాన్ని ప్రత్యేక ప్రసారం ద్వారా వీక్షించడం జరిగింది. ఉట్నూర్ ITI కళాశాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో, నిరుపయోగంగా ఉన్న ఫర్నిచర్‌కు తమ నైపుణ్యంతో మెరుగులు దిద్ది ఉపయోగంలోకి తెచ్చారని అభినందించారు.
శాసనసభ్యులు వెడ్మ బొజ్జు, పాయల్ శంకర్ మాట్లాడుతూ గత సంవత్సరం సెప్టెంబర్ 17న విశ్వకర్మ జయంతిని పురస్కరించుకొని ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగిందని, 18 రకాల సంప్రదాయ చేతి వృత్తులు ఈ పథకానికి అర్హులని అన్నారు. చేతి వృత్తి కళాకారుల ఉత్పత్తుల నాణ్యతను పెంచి, వారిని దేశీయ, గ్లోబల్ మార్కెట్‌తో అనుసంధానం చేయడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అని అన్నారు. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని తమ వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని, తద్వారా ఆర్థికంగా అభివృద్ధిని సాధించాలని కోరారు.
అంతకుముందు పార్లమెంట్ సభ్యులు, శాసన సభ్యులు జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించి మొదటి విడతలో శిక్షణ పొందిన 21 మందికి సర్టిఫికెట్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో సంబంధిత జిల్లా అధికారులు, కళాకారులు తదితరులు పాల్గొన్నారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments