రిపబ్లిక్ హిందుస్థాన్, అదిలాబాద్:
ఆదిలాబాద్ పట్టణంలోని రామ్ నగర్ కాలనీ 11వ వార్డులో ఏర్పాటు చేసిన శ్రీ చంద్ర గణేష్ మండల్ ప్రసాదాన్ని రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కళాశాల డైరెక్టర్ డాక్టర్ జయసింగ్ రాథోడ్ కు శ్రీ చంద్ర గణేష్ మండల్ సభ్యులు సామనపల్లి రామన్న, కదం నరేష్ లు ప్రసాదాన్ని డైరెక్టర్ కి అందజేశారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ డైరెక్టర్ డాక్టర్ జయసింగ్ రాథోడ్ మాట్లాడుతూ 9 రోజులపాటు ప్రత్యేక పూజలు నిర్వహించిన గణేష్ ప్రసాదం నీకు ఎంతో ప్రాధాన్యత ఉందని తెలిపారు. గణేష్ విగ్రహానికి తొమ్మిది రోజులపాటు నీ అమ్మ నిబంధనలతో ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. వాడ వాడల గణపతి విగ్రహాలు నిర్వహించి తొమ్మిది రోజులపాటు పూజల నిర్వహించడం సంతోషకరంగా ఉందన్నారు. రాంనగర్ కాలనీకి చెందిన శ్రీ చంద్ర గణేష్ మండల్ వారు ప్రత్యేకంగా ప్రసాదం అందించడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ పిఏ అశ్విన్ కుమార్ తదితరులు ఉన్నారు.
Recent Comments