ఆదివాసి సేన ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు రాయిసిడం జంగు పటేల్
గూడిహత్నూర్ : కుంరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని ఆదివాసి మహిళపై అత్యాచార ప్రయత్నం చేసి, హత్యచేసి దానిని రోడ్డు ప్రమాదంగా చిత్రికరించిన షేక్ ముగ్దుం అనే దుండగుడిని వేంటనే బహిరంగంగా ఉరి తీయాలని ఆదివాసి సేన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు రాయిసిడం జంగు పటేల్ డిమాండ్ చేశారు. బాధిత మహిళకు ప్రభుత్వమే మెరుగైన వైద్యం అందించి తగు నష్టపరిహారాన్ని చెల్లించి క్షేమంగా కుటుంబ సభ్యులకు అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. బాధిత మహిళకు ప్రాణనష్టం జరిగినచో ఆదివాసి సమాజం, అన్ని ఆదివాసీ సంఘాలతో కలిసి ఏజెన్సీ ప్రాంతంలో త్రీవ ఉద్యమాన్ని చెపడతమని ఆయన హెచ్చరించారు
Recent Comments