*జైనూరు ఘటనపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసిన వారి పై చర్యలు తీసుకోబడతాయి.*
*మతాల మధ్య విద్వేషం రెచ్చగొట్టే వారిపై కఠిన చర్యలు తప్పవు.*
*సోషల్ మీడియా పై జిల్లా పోలీసుల నిఘా.*
*సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దు*
*జైనూరు నందు 144 సెక్షన్ అమలు, ఇతరులకు జైనూర్ వెళ్ళడానికి అనుమతి లేదు.*
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ /జైనూర్ :
బుధవారం రోజు జైనుర్ నందు జరిగిన ఘటనపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని జిల్లా ఎస్పీ గౌష్ ఆలం ఐపిఎస్ హెచ్చరించారు. ప్రజలందరూ సంయమనం పాటించాలని, పోలీసు యంత్రాంగం కేసులను నమోదు చేసిందని, దర్యాప్తు కొనసాగుతుందని, కాకులపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దని తెలిపారు.
వదంతులను ప్రచారం చేస్తూ మతాల మధ్య చిచ్చుపెట్టే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.సోషల్ మీడియాపై జిల్లా పోలీసు యంత్రాంగం నిఘా ఏర్పాటు చేసిందని నిజా నిజాలు తెలుసుకోకుండా ప్రచారం చేసిన వారిపై, వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ లపై చర్యలు తీసుకోబడతాయని, కేసులు నమోదు చేయబడతాయని తెలిపారు.
ముఖ్యంగా జైనుర్ నందు 144 సెక్షన్ అమలులో ఉందని ఇతర ప్రాంతాలవారికి జైనూరు నందు అనుమతి లేదని, చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.తప్పు చేసిన వారికి శిక్షలు తప్పవని జిల్లా ఎస్పీ తెలియజేశారు.
Recent Comments