బజార్ హత్నూర్: మండలంలోని భూతాయి బి గ్రామానికి చెందిన ఫడ్ మారుతి మానవతా దృక్పథంతో వరద బాధితులను ఆదుకున్నారు. ఇటీవల ఈడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలలో మహురే కీర్బా, గ్రామం భూతాయి బి పురాతన ఇల్లు కూలిపోయి తను సర్వస్వం కోల్పోవడం జరిగింది అయితే గత రెండు రోజులుగా ఆ కుటుంబాన్ని రెండు పూటల భోజనాలు పెడుతూ మంగళవారం రోజు వారికి కిరాణ సామాన్లు కూడా అందించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ నూర్ సింగ్ ఉన్నత శ్రేణి గుమస్తా విద్యాసాగర్ రెడ్డి రెవెన్యూ అసిస్టెంట్ సల్మాన్ తదితరులు పాల్గొన్నారు ఇట్టి కుటుంబానికి తాత్కాలికంగా నివాసం పాఠశాలలోని ఓ గదిలో తాసిల్దార్ జి శంకర్ ఏర్పాటు చేయడంతో ఆ కుటుంబం సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు.



Recent Comments