రిపబ్లిక్ హిందుస్థాన్, బజార్ హత్నూర్ :
ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం పరిదిలోని బజార్ హత్నూర్ మండల కేంద్రం ఆదివారం రోజు తెలంగాణ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మకు పాడే కట్టుకొని చావు డప్పు కొడుతూ రైతన్నలు బజార్ హత్నూర్ వీదులలో ఊరేగింపు చేస్తూ నిరసనలు తెలిపారు. ఎన్నికలప్పుడు సాధ్యం కానీ హామీ లిచ్చి రైతులను మోసపుచ్చారని రైతులు అన్నారు.ఎలాంటి ఆంక్షలు లేకుండా రూ.2 లక్షల పంట రుణమాఫీ చేస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చి గద్దెనెక్కిన సీఎం రేవంత్ రెడ్డి రైతులను వంచించి రైతులందరికి రుణమాఫీ చేయకుండా మోసం చేసినందుకు నిరసనగా తాము ఈ కార్యక్రమం చేపట్టడంతో నైనా ఆయన సిగ్గు తెచ్చుకొని షరతులు లేకుండా ప్రతీ పట్టా ఉన్న రైతుకు రూపాయలు 2 పంట ఋణం మాఫీ వర్తింపు చేయాలి అని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభత్వం బుద్ది తెచ్చుకుని రెండు లక్షల వరకు రైతులందరికి రుణమాఫీ చేసి ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న రైతన్నల మొహంలో చిరునవ్వులు నింపాలని రైతన్నలు కోరారు. ఈ కార్యక్రమం లో పలు గ్రామాల రైతులు పాల్గొన్నారు.
Recent Comments