ePaper
Thursday, April 30, 2026
📄 ePaper

స్థల వివాదంలో … హెడ్ కానిస్టేబుల్ పై ఎఫ్ఐఆర్…

📰 Generate e-Paper Clip


స్థల వివాదంలో మున్సిపల్ కమిషనర్ కంప్లయింట్
విధులకు ఆటంకం కలిగించాడని ఎస్ హెచ్ఓకు లేఖ
కేసు నమోదు చేసిన పోలీసులు


రిపబ్లిక్ హిందుస్థాన్ : శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన పోలీసులు తరుచూ ఏదో ఒక వివాదంలో చిక్కుకుని పోలీసు శాఖకు మాయని మచ్చను తీసుకువస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం , ఎఫ్ ఐ ఆర్ లో పెర్ల మార్పు వ్యవహారాలు మరిచిపోకముందే .. ఆదిలాబాద్ పట్టణంలో ఓ పోలీసు హెడ్ కానస్టేబుల్ స్థల వివాదంలో చిక్కుకోవడం అతని పై కేసు నమోదు కావడం సర్వత్ర చర్చనీయాంశంగా మారింది.


ఓ స్థల వివాదం కేసులో పోలీస్ డిపార్ట్ మెంట్ కు చెందిన హెడ్ కానిస్టేబుల్ ర్యాంక్ కలిగిన వ్యక్తిపై ఎఫ్ఐఆర్ బుక్ అయింది. ఐపీసీ 447, 427, 186 కింద కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ లోని వివరాలు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పోలీస్ డిపార్ట్ మెంట్ లో హెడ్ కానిస్టేబుల్ ర్యాంక్ ఉన్న షేక్ మురాద్ అలీ పట్టణంలోని రిక్షాకాలనీలో నెలన్నర రోజుల క్రితం కొత్త ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించాడు.

అయితే తనకు చెందిన కొంత స్థలాన్ని ఆక్రమించుకొని నిర్మాణం ప్రారంభించాడని అతని ఇంటి పక్కనే ఉండే అజీమ్ పట్టణ టూటౌన్ పోలీస్ స్టేషన్ తోపాటు కలెక్టర్ ప్రజావాణి, మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు చేశాడు. మున్సిపల్ అధికారులు పలుమార్లు నోటీసులు జారీ చేశారు. స్థల వివాదం నేపథ్యంలో కోర్టుకు వెళ్లి సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. అయినా వాటిని పట్టించుకోకుండా ఇటీవల మురాద్ అలీ బౌండరీ వాల్ నిర్మాణం ప్రారంభించాడు. అయితే పనులను ఆపివేయాలని అక్కడికి మున్సిపల్ సిబ్బంది రాగా, వారి పట్ల దురుసుగా ప్రవర్తించాడు. విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా భయభ్రాంతులకు గురి చేశాడు. ఈ విషయాన్ని మున్సిపల్ సిబ్బంది ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. తన స్థలాన్ని ఆక్రమించి బౌండరీ నిర్మించాడని అజీమ్ సైతం మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఇతరుల స్థలాన్ని ఆక్రమించి నిబంధనలకు విరుద్ధంగా బౌండరీ వాల్ కట్టడం, మున్సిపల్ సిబ్బందిని భయభ్రాంతులకు గురి చేయడం, వారి విధులకు ఆటంకం కలిగించిన మురాద్ అలీపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి చర్యలు తీసుకోవాలని మున్సిపాలిటీ అధికారులు పట్టణ టూటౌన్ ఎస్ హెచ్ఓకు లేఖ రాశారు. దీంతో టూటౌన్ పోలీసులు ఐపీసీ 447, 427, 186 కింద కేసు నమోదు చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!
https://man2bantul.id/https://portal.man2bantul.id/https://sirekap.man2bantul.id/https://eptsp.man2bantul.id/https://smkn5balam.com/https://tuluskartika.or.id/https://smptk.tuluskartika.or.id/https://www.stai-nurulhidayah.ac.id/https://journal.stai-nurulhidayah.ac.id/https://ejurnal.stai-nurulhidayah.ac.id/https://tical2025.redclara.net/https://uptdselatan.com/masterpoker99masterpoker99masterpoker99poker757poker757
masterpoker99masterpoker99masterpoker99masterpoker99inifun88inifun88inifun88https://jrdindustry.com/inifun88inifun88inifun88inifun88inifun88vovo88vovo88vovo88vovo88vovo88
inifun88inifun 88inifun88 logininipokerini pokerinipoker loginvovo88vovo88vovo88vovo88inifun88inifun88inifun88vovo88