ePaper
Tuesday, March 10, 2026
📄 ePaper

గూగుల్, యూట్యూబ్‌లకు ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

📰 Generate e-Paper Clip

Thank you for reading this post, don't forget to subscribe!

గూగుల్, యూట్యూబ్‌లకు ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. చంద్రబాబు కేసులో విచారణ జరిపిన జడ్జిలపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది.

పోస్టులు అభ్యంతర కరంగా ఉన్నాయని చెప్పినా గూగుల్ , యూట్యూబ్ తొలగించలేదని ఏజీ శ్రీరామ్ కోర్టుకు తెలిపారు.

కోర్టు ఆదేశాలు లేదా అధికారిక ఉత్తర్వులు ఏదో ఒకటి ఉంటే తప్ప తొలగించలేమని గూగుల్ న్యాయవాది కోర్టుకు తెలిపారు. వెంటనే ఈ పోస్టులు తొలగించాలని న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసులో మరికొందరిని ప్రతివాదులుగా చేరుస్తూ అనుబంధ పిటిషన్‌ను ఏజీ శ్రీరామ్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ప్రతివాదులకు నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ 6 వారాలకు ఉన్నత న్యాయస్థానం వాయిదా వేసింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!