రిపబ్లిక్ హిందుస్థాన్, బోథ్ :
నిర్మల్ జిల్లా నిర్మల్ మండలం ముజ్గీ మల్లన్న. గ్రామంలోని మూజ్గి మల్లన్న దేవాలయం నుంచి భక్తుల పాదయాత్రతో ప్రారంభమైన మల్లన్న పల్లకి పల్లకి పాదయాత్ర శనివారం బోథ్ మండల కేంద్రంలోని పలు వీధుల గుండా దర్శనం ఇవ్వడంతో పలువురు భక్తులు పల్లకిలో ఉన్న ముజిగి మల్లన్న పలువురు భక్తులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మల్లన్న భక్తులైన మహేష్ గణేష్ మల్లేష్ లు మాట్లాడుతూ 70 సంవత్సరాలు నుంచి తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం ప్రకారం ముజిగి మల్లన్న దేవాలయం నుంచి ప్రారంభమైన 60 రోజులు పల్లకి పాదయాత్ర నిర్మల్ సారంగాపూర్ గుడిహత్నూర్ ఆదిలాబాద్ నుంచి మహారాష్ట్రలో బయలుదేరుతుంది. మహారాష్ట్ర నుంచి పాట్నా లోని పుణ్య నది అయినటువంటి గంగాలో ముజిగ మల్లన్న స్నానం చేయించి అనంతరం తిరిగి ప్రయాణంలో మల్లన్న దేవాలయానికి తీసుకువచ్చి మల్లన్న ప్రోక్షణం చేసి పున్న ప్రతిష్ఠన చేయడం జరుగుతుందని అన్నారు. అనంతరం ముజిగీ గ్రామంలో మాఘ పూర్ణిమ రోజు నుంచి ఐదు రోజుల పాటు ముజాగి మల్లన్న జాతర కొనసాగుతుందని అన్నారు. ఈ ఐదు రోజులలో మొదటి రోజు మల్లన్న కళ్యాణం ఉత్సవం రెండవ రోజు నల్లకుండలు బోనాల పండుగ మూడవరోజు రథం ఊరేగింపు మహోత్సవం నాలుగవ రోజు నాగవల్లి కార్యక్రమం 5 వ రోజు అగ్నిగుండం ప్రవేశము ఉంటుందని మహేష్ మహారాజ్ గణేష్ మహారాజ్ తెలిపారు. ఈ పల్లకి కార్యక్రమంలో బొల్లారం అశోక్, జ్యోతి వర్మ , మాధవ్, పోశెట్టి , విజయలక్ష్మి, భాగ్యలక్ష్మి మరియు ముజగి మల్లన్న భక్తులు తదితరులు పాల్గొన్నారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments