మంచిర్యాల, జనవరి 16 (రిపబ్లిక్ హిందూస్తాన్) :
మంచిర్యాల పట్టణంలోని జన్మభూమి నగర్ లో బీసీ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో నాయకులు మాట్లాడుతూ తెలంగాణలో బీసీ కులగణన చేపట్టిన తర్వాతే సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బీసీ కులగణన నిర్వహించి బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతాము అంటూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని,15 రోజుల్లో సర్పంచ్ పదవి కాలం ముగుస్తున్న నేపద్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ డిక్లరేషన్ సభలో ప్రకటించిన విధంగా స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్ల పెంపు వాటిని ఏబిసిడి గ్రూపులుగా వర్గీకరిస్తామని చెప్పిన మాటను నిలబెట్టుకోవాలని అన్నారు.రాష్ట్రంలో మొత్తం సర్పంచ్ స్థానాలు 12751 ఉంటే 6350 సర్పంచ్ స్థానాలు బీసీలకు అవకాశాలు వస్తాయి బీసీలకు జనాభా ప్రాతిపదికన అవకాశాలు రావాలంటే అది బీసీ కులగణతోనే సాధ్యమని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గుమ్ముల శ్రీనివాస్,నాయకులు కట్కురి శ్రీనివాస్,మహేందర్,సతీష్,రాజశేఖర్,వెంకటేష్,చిన్న తదితరులు పాల్గొన్నారు.
Recent Comments