రామకృష్ణాపూర్, జనవరి 30 (రిపబ్లిక్ హిందుస్థాన్) :
క్యాతన్ పల్లి మున్సిపాలిటీ లోని రాజీవ్ చౌక్ వద్దగల బస్టాండ్ వెనకాల చెత్త పేరుకుపోయి దుర్గంధం వస్తోంది.నిత్యం వందల మంది ప్రయాణించే చోట చెత్త పేరుకు పోవడంతో బస్టాండ్ ఆవరణలో ప్రయాణికులు వేచి ఉండే పరిస్థితి లేదు.బస్ కోసం వేచి ఉండే ప్రయాణికులు బస్టాండ్ వద్ద వచ్చే కంపు తో ఇబ్బంది పడుతున్నారు.సంబంధిత అధికారులు స్పందించి చెత్తను తొలగించాలని ప్రయాణికులు కోరుతున్నారు.


Recent Comments