ఆదిలాబాద్ :
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా పాలనలో అభయహస్తం మొదటి రోజు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేయబడిన దరఖాస్తు కేంద్రాలను, జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి ఉదయం తిరిగి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొలిపుర ప్రభుత్వ పాఠశాల నందు, మహాలక్ష్మి వాడ ప్రభుత్వ పాఠశాల నందు, తాంసి మండలం వడ్డాడి గ్రామం గ్రామపంచాయతీ కార్యాలయం నందు ఏర్పాటు చేయబడిన దరఖాస్తు కేంద్రాలను జిల్లా ఎస్పీ పరిశీలించి ప్రజలతో, సిబ్బందితో చర్చించారు. దరఖాస్తు చేసే ప్రతి ఒక్క వ్యక్తి సరైన పద్ధతిలో ఎటువంటి తప్పులు దొరలకుండా తమ వివరాలను పూర్తిగా పొందుపరచాలని సూచించారు. ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలను అందజేయాలని లక్ష్యంతో అభయహస్తం ప్రజా పాలన కార్యక్రమాలను నిర్వహిస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, గ్రామీణ సర్కిల్ కార్యాలయ సిఐ సైదారావు, రెండవ పట్టణ సీఐ అశోక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Recent Comments