రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ :
మండలంలోని సిరిచెల్మ గ్రామంలోని మహాలక్ష్మి ఆలయం వద్ద మంగళవారం బాదిగూడ, పకిర్ పెట్, జగ్నాపూర్ గ్రామాలకు చెందిన ఆదివాసి రైతులు ప్రతి సంవత్సరం లాగే ఆనవాయితీగా ఈ సంవత్సరం ఖరీఫ్ కు ముందు తమ పొలాల్లో విత్తుకునే ధాన్యాలను ఆలయానికి తీసుకువచ్చి పూజలు నిర్వహించారు. అనంతరం గిరిజనులంతా కలిసి వారి ఇండ్ల వద్ద మొహుతుర్ పండుగను నిర్వహించారు. ఖరీఫ్ లో వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండి పిల్ల పాపలు బాగుండాలని మంచి దిగుబడి రావాలని మహాలక్ష్మి అమ్మవారికి మొక్కుకున్నట్లు ఆదివాసి పెద్దలు తెలిపారు.

Recent Comments