మరోసారి కరోనా డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. రోజూవారీ కేసుల్లో భారీ పెరుగుదల కనిపిస్తోంది. దేశంలో కొత్తగా 6,050 కరోనా కేసులు నమోదయ్యాయి. కొవిడ్ వైరస్ వల్ల మరో 14 మరణించారు. ఇప్పటి వరకు కొవిడ్‌తో మరణించిన వారి సంఖ్య 5,30,943కు చేరింది. దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 28,303కు చేరింది. వరుసగా ప్రతీ రోజు కేసుల సంఖ్య పెరగటం పైన కేంద్రం అలర్ట్ అయింది. అన్ని రాష్ట్రాల ఆరోగ్య శాఖ కార్యదర్శులతో ఈ రోజు కేంద్ర ఆరోగ్య శాఖ వీడియో కాన్ఫిరెన్స్ నిర్వహిస్తోంది. కొత్త మార్గదర్శకాల జారీకి సిద్దమైంది.
కరోనా డేంజర్ బెల్స్ – అప్రమత్తంగా ఉండాల్సిందే..!!
Thank you for reading this post, don't forget to subscribe!
Previous article
- Advertisment -


Recent Comments