◆ఇన్సూరెన్స్ చెక్కు పంపిణీలో బోథ్ ఎమ్మెల్యే
ఆదిలాబాద్ :
బీఆర్ఎస్ పార్టీని నమ్ముకొని పని చేస్తున్న కార్యకర్తలకు అండగా బీఆర్ఎస్ పార్టీ నిలుస్తుందని,కార్యకర్తలే మా బలమని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు అన్నారు. ఇచ్చోడ మండలం దరంపూరి గ్రామానికి చెందిన బి ఆర్ ఎస్ పార్టి కార్యకర్త కిర్సంలే ఉత్తమ్ ప్రమాదవశాత్తు మృతి చెందడముతో పార్టి సభ్యత్వ ఇన్సూరెన్స్ కింద తన భార్య అయిన కిర్సంలే శివ నందబాయి కి పార్టి మంజూరు చేసిన 2 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ చెక్కును ఆదివారం రోజున ఆదిలాబాద్ లోని తన నివాసములో బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు అందించారు. ఈ సందర్బంగా తను మాట్లాడుతూ ఆనాడు 14 ఏండ్లు కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడములో కేసీఆర్ నాయకత్వములో కార్యకర్తలు ముందున్నారని,నాటి పోరాట పటిమతోని నేడు అభివృద్ధిలో బాటలో తెలంగాణ దూసుకుపోతుందని, ఏ కార్యకర్తకి ఆపద వచ్చిన బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తుందని, కార్యకర్తలే పార్టికి బలమని,వారికి అండగా నిలబడడమే పార్టి ప్రధాన ద్వేయమని అన్నారు. ఈ కార్యక్రమములో డి. సీ.సీ.బి ఛైర్మెన్ అడ్డి బోజారెడ్డి, దరంపూరి గ్రామధ్యక్షులు దుక్రే తానజీ,కార్యకర్తలు పాల్గొన్నారు.


Recent Comments