రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడా :ఓ కౌలు రైతు ఆశలు అడియశాలయ్యాయి. అరుగాలం కష్టపడి పండించిన శనగ పంట కాలిబూడిద అయింది.
ఇచ్చోడా మండలం నవేగామ గ్రామానికి చెందిన భగ్నూరే లక్ష్మణ్ రావ్ అనే కౌలు రైతు ఇచ్చోడా మండల కేంద్రంలో ఓ రైతుకు చెందిన ఏడు (7) ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని అందులో శనగ పంటను వేశాడు. పంట కోత చేసిన కుప్పపోశాడు. అయితే శనగ పంట కుప్పకు శుక్రవారం రొజు రాత్రి సమయంలో నిప్పంటుకోవడంతో పూర్తిగా పంట కాలిపోయింది.
పంట కాలిన ప్రదేశాన్ని ఇచ్చోడా మండల రెవెన్యూ సిబ్బంది పరిశీలించి పంచనామా నిర్వహించారు. ఒక లక్ష తొంబై వేల రూపాయలు విలువ చేసే 35 క్వింటాళ్ళ శనగ పంట అగ్గిపాలయింది.
Recent Comments