రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ :
సిలెండర్ ధరను పెంచిన కేంద్రములోని బి.జె.పి వైఖరిని నిరసిస్తూ ఇచ్చోడ మండల కేంద్రములో బి.ఆర్.ఎస్ మండల శాఖ ఆధ్వర్యములో భారీ రాస్తారోఖో నిర్వహించారు,ఈ నిరసన కార్యక్రమము సందర్బంగా 30 నిమిషాల పాటు ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ఈ సందర్బంగా మాజీ మండల కన్వీనర్ మెరాజ్ హమ్మద్ మాట్లాడుతూ అధిష్టాన ఆదేశానుసారం బోథ్ శాసనసభ్యుడు రాథోడ్ బాపురావు నాయకత్వ సూచనల మేరకు ఈ భారీ రాస్తారోఖో నిర్వహించడం జరిగిందని అన్నారు. పేద కుటుంబాలకు గుదిబండల తయారైన సిలెండర్ ధర పెంపుని కేంద్రములోని బి .జె.పి వెంటనే విరమించుకోవాలని లేని యెడల తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తం చేస్తామని అన్నారు,మాజీ ఎంపీపీ డుక్రే సుభాష్ పటేల్ మాట్లాడుతూ పేద కుటుంబాలకు అండగా నిలిచే ఏకైక ప్రభుత్వం బి.ఆర్.ఎస్ ప్రభుత్వమని, కేంద్రములోని బి.జె.పి ప్రభుత్వం ఏనాడు పేదవాని పక్షాన ఆలోచించ లేదని అలాంటి ప్రభుత్వాన్ని గద్దె దించాలని అన్నారు.
ఈ కార్యక్రమములో ఆత్మ ఛైర్మెన్ నరాల రవీందర్,రైతు బంధు అధ్యక్షులు ముస్తఫా,పార్టి వైస్ ప్రెసిడెంట్ సుద్దవార్ వెంకటేష్,ఎస్టీ సెల్ ప్రెసిడెంట్ రాథోడ్ ప్రవీణ్,బి.సి సెల్ ప్రెసిడెంట్ ఆర్గుల గణేష్,ఎస్సి సెల్ ప్రెసిడెంట్ గాయికాంబ్లీ గణేష్,సోషల్ మీడియా కన్వీనర్ దాసరి భాస్కర్,రాథోడ్ ప్రకాష్,కతలే విత్తల్,లతిప్,గ్యాతం గంగయ్య,యూత్ ప్రెసిడెంట్ మైల మహేష్,కొప్పుల శంకర్,భూతి రాజు,రమేష్ , షాభిర్, గంగారాం తదితరులు పాల్గొన్నారు.
సిలెండర్ ధర పెంపును నిరసిస్తూ ఇచ్చోడలో భారీ ధర్నా
Recent Comments