
ఇచ్చోడ మండలంలోని గుండి వాగు గ్రామానికి చెందిన జుమ్డే బాలాజీ (28) అనే వ్యక్తి మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. మృతిని భార్య కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం…
Thank you for reading this post, don't forget to subscribe!గుండి వాగు గ్రామంలో కొంతమంది నా భర్త పై 15 రోజుల క్రితం దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని మృతిని భార్య అనిత తెలిపింది. అయితే అదే రోజు స్థానిక ఇచ్చోడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు మృతుని భార్య జుమ్డే అనిత తెలిపింది. అయితే పోలీసులకు ఫిర్యాదు చేసిన రోజు రాత్రి కూడా గ్రామంలో ని కొంతమంది తీవ్రంగా కొట్టినట్లు తెలిపింది.
ఫిర్యాదు చేసిన రోజే గొడవ పడ్డ రెండు వర్గాల పై పోలీసులు కేసు నమోదు చేసినట్లు ఇంచార్జి ఎస్సై నీరేష్ తెలిపారు…
సీసీ రోడ్ విషయంలో వివాదం జరిగింది.
పోలీసులు దాడి జరిగిన రోజు ఫిర్యాదు చేసిన ఎలాంటి చర్య తీసుకోకపోవడంతో మళ్ళీ దాడి చేసిన వాళ్ళు తిరిగి కొడతారని బాలాజీ భయబ్రాంతులకు గురయ్యాడని తెలిపింది. ఇదే క్రమంలో ఛాతీలో కొట్టిన దెబ్బలకు ఛాతీలో నొప్పిగా ఉందని తెలపడంతో హుటాహుటిన ఆదిలాబాద్ ఆసుపత్రికి తరలించి క్రమంలో మార్గమధ్యంలో మృతి చెందినట్లు ఆమె తెలిపింది. పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే మా ఆయన ప్రాణాలు గాల్లోకలిసేది కాదు అని రోదిస్తూ ఆరోపించింది. దాడి చేసిన వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
మృతునికి భార్య , ముగ్గురు సంతానం ఉన్నారు.
అయితే ఇచ్చోడలోని ఓ ప్రముఖ టెంట్ వ్యాపారి మధ్యవర్తిగా ఉండి కేసు కాకుండా చూసినట్లు కుటుంబ సభ్యులు తెలపడం గమనార్హం.
Recent Comments