◾️అమరవీరులను స్మరిస్తూ రెండు నిమిషాల మౌనం పాటించిన – జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి ….
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :
కేంద్ర హోంశాఖ నిర్దేశం మేరకు జాతీయ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సోమవారం స్థానిక పోలీసు ముఖ్య కార్యాలయం నందు జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఉదయం 11 గంటలకు క్రమశిక్షణతో రెండు నిమిషాల పాటు జిల్లా కార్యాలయం అధికారులు మౌనం పాటించారు. జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి సూచన మేరకు జిల్లాలోని అన్ని పోలీస్ కార్యాలయాలు, పోలీస్ స్టేషన్ ల సిబ్బంది, ఉదయం 11 గంటలకు రెండు నిమిషాల మౌనం పాటించారు. ఈ క్రమంలో పోలీసు ముఖ్య కార్యాలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసి కలిసికట్టుగా అందరూ రెండు నిమిషాలు మౌనం పాటించార. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన అమరవీరుల సేవలను వివరించారు. ప్రతి ఏటా జనవరి 30న భారతదేశమంతా ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందని పేర్కొన్నారు. దేశ భద్రత, ప్రజల రక్షణ కోసం పోలీసులు తమ ప్రాణాలను సైతం తృణప్రాయంగా అర్పిస్తూ ఉంటారని కొనియాడారు. అమర వీరులను స్మరించుకోవడం దేశపౌరుల బాధ్యతగా భావించాలని అన్నారు. కార్యక్రమంలో కార్యాలయం ఏవో మహమ్మద్ యూనుస్ అలి, పర్యవేక్షకులు ఎం ఏ జోసెఫిన్, గంగాధర్, ఎంటీవో ఎం శ్రీపాల్, ఫింగర్ ప్రింట్ నిపుణులు శ్రీనివాస్, సెక్షన్ అధికారులు, టి. మురళి మోహన్, పోలీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పెంచాల వెంకటేశ్వర్లు, కార్యదర్శి గిన్నెల సత్యనారాయణ, ఐటీ కోర్ ఎం ఏ రియాజ్, డిసిఆర్బి సీఐ గుణవంతరావు, ఎస్ఐ ఎం ఏ హకీం, హెడ్ కానిస్టేబుల్ అతావుల్లా ఖాన్, పి సంజీవ్, మహిళా ఏ ఎస్ఐలు జైస్వాల్ కవిత, తదితరులు పాల్గొన్నారు.

Recent Comments