కేంద్రములోని బిజెపి ప్రభుత్వం తన రైతు వ్యతిరేఖ విధానాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి లేదంటే రైతులతో కలసి మహా ఉద్యమమేనని మహా ధర్నాలో కేంద్రాన్ని హెచ్చరించిన బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ / బోథ్ : కేంద్రములోని బిజెపి ప్రభుత్వం తెలంగాణలోని రైతు కల్లాలకు నిర్మాణానికి వినియోగించిన 151 కోట్లను తిరిగి చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్న రైతు వ్యతిరేక విధానాన్ని నిరసిస్తూ జిల్లా కేంద్రములో ధర్నా నిర్వహించాలని మంత్రి కేటీఆర్ పిలుపు ఇచ్చిన నేపథ్యంలో శుక్రవారం రోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రములోని కలెక్టర్ కార్యాలయం ముందర జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్ తో కలసి బోథ్ శాసనసభ్యుడు రాథోడ్ బాపురావు మహా ధర్నా నిర్వహించారు.
ఈ ధర్నా కార్యక్రమములో బోథ్ నియోజకవర్గములోని ఆయా మండలాల నుండి కార్యకర్తలు పెద్ద మొత్తములో పాల్గొని ఆద్యంతం జై బిఆర్ఎస్,జై కేసీఆర్, బిజెపి కి హఠావో దేశ్ కి బచావో,రైతు వ్యతిరేకి మోడీ లాంటి నినాదాలతో మారు మోగించారు. ఈ సందర్బంగా బోథ్ ఎమ్మెల్యే మీడియా తో మాట్లాడుతూ కేంద్రములోని బి జె పి ప్రభుత్వం రైతు వ్యతిరేక నిర్ణయమైన కల్లాలకు వినియోగించిన 151 కోట్లు చెల్లించాలనే నిర్ణయాన్ని వెంటనే వాపసు తీసుకుని తెలంగాణ రైతాంగానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని లేని యెడల రైతులతో కలసి నిరసనలను వేడెక్కిస్తామని హెచ్చరించారు. రాబోయే కాలంలో కేసీఆర్ నాయకత్వములో దేశమంతటా బిఆర్ఎస్ ప్రభంజనం సృష్టించబోతుందని, బిజెపి కేసీఆర్ కు భయపడే ఎలాగైనా ఏదో ఒక్క ఆటంకం సృష్టించాలని దురుద్దేశముతోనే ఇలాంటి దుందుకుడు చర్యలకు పాటు పడటం సిగ్గు చేటని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమములో బోథ్ నియోజకవర్గ అధికార ప్రతినిధితో పాటు,9 మండలాల కన్వీనర్లు,మార్కెట్ కమిటీ చైర్మన్లు,ఆత్మ చైర్మన్లు,సొసైటీ చైర్మన్లు, జడ్పీటీసీలు, ఎంపీపీ లు,సీనియర్ నాయకులు, సర్పంచులు,ఎంపీటీసీలు,మహిళ నాయకులు,పార్టి ఆయా విభాగాల బాధ్యులు,రైతు బంధు అధ్యక్షులు,పెద్ద మొత్తములో రైతులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
Recent Comments