Supreme Court : దేశంలో బలవంతపు, మోసపూరిత మతమార్పిడులపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై ఇటీవల కీలక ఆదేశాలు జారీ చేసింది. కొన్ని చోట్ల జరుగుతున్న బలవంతపు మతమార్పిడులు చాలా తీవ్రమైన అంశమని వ్యాఖ్యానించింది. వాటిని నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని పేర్కొంది. ఇలాంటి పరిస్థితిని అరికట్టకపోతే అత్యంత ప్రమాదకరంగా మారుతుందని పేర్కొంది. తాజాగా ఈ అంశంపై మళ్లీ కీలక వ్యాఖ్యలు చేసింది. దేశంలో బలవంతపు మత మార్పిళ్లపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బలవంతపు మార్పిళ్లు అడ్డుకోకపోతే క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఈ అంశంపై త్వరితగతిన చర్యలు చేపట్టాలని కేంద్రానికి సూచించింది. దేశ భద్రత, మత స్వేచ్ఛను ప్రభావితం చేసే సమస్య అని హెచ్చరించింది. కేంద్ర ప్రభుత్వం బలవంతపు మతమార్పిడిలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
గిరి పల్లెలు క్రైస్తవ మాఫియా కోరల్లో చిక్కుకున్నాయి. భారతదేశంలో

హైందవ ధర్మం మీద ముప్పేట దాడి జరుగుతూనే ఉంది. ఎక్కడికక్కడ
హైందవ సంఘాలు ప్రతిఘటిస్తూనే ఉన్నా మతమార్పిడులుమాత్రం ఆగడం లేదు.
ఇటీవల కాలంలో అనేక ఆదివాసి పల్లెలలో అన్యమత ప్రచారం యదేచ్చగా సాగుతుంది.
క్రైస్తవ మత ప్రచారం మెలమెల్లగా హైందవ ధర్మం విచ్చిన్నం కోసం ప్రయత్నిస్తూనే ఉంది.
గత కొన్ని నెలల క్రితం బోథ్ మండలం లోని గిరి పల్లెల్లో అన్యమత ప్రచారం చేస్తూ, వారిని అనేక ప్రలోభాలకు గురిచేస్తూ,వారి పేదరికాన్ని ఆసరాగా చేసుకొని ఆర్థికంగా సహాయపడుతున్నామని నమ్మించి వారికి బ్యాంక్ ఎకౌంట్లు తీయిస్తాం అని క్రైస్తవ మతంలోకి మార్చడానికి
విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ అక్కడి యువతకు తెలిసి అడ్డుకొవడంతో వారు పెట్టే బేడా సర్దుకుని వెళ్లేలా చేశారు.
అయినా కానీ మార్పు కనబడలేదు.
వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేస్తామని చెప్పి,మెల్లమెల్లగా చర్చి నిర్మాణాలు చేయడం హిందువులను మతం మార్చడం ఇదే తంతు గా అనునిత్యం సాగుతోంది.
ఇటీవల బోథ్ మండలంలోని కోట-కే గ్రామం, అసలు క్రైస్తవులే లేని ఊరు, అక్కడికి వచ్చి మతమార్పిడి చేయడమే కాకుండా వారి ద్వారా ఇతరులను ప్రలోభాలకు గురి చేస్తూ మతమార్పిడిని ప్రోత్సహిస్తున్నారు.

ఇది తెలిసిన హిందూ సంఘాలు అడ్డుకొని వారిని వెళ్లగొట్టడమే కాకుండా హైందవ సంఘాల ఆధ్వర్యంలో వారికి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసారు.
కొన్ని రోజులు స్తబ్దుగా ఉన్న క్రైస్తవులు అదునుగా భావించి, తమ పథకాన్ని మళ్ళీ ప్రారంభించారు. ఒక సంవత్సరం పాటుగా గిరిజన ఆదివాసులను తమ టార్గెట్ గా చేసుకొని మత ప్రచారం జోరుగా సాగిస్తున్నారు. భారతదేశానికి మూలవాసులు ఆదివాసులు

సనాతన సాంప్రదాయానికి విలువ ఇచ్చేవారు. ప్రాచీన సంప్రదాయ పద్ధతులనే
పాటిస్తూ మన అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. అలాంటి గిరిజన ఆదివాసి గూడలలో అన్యమత ప్రచారం చేస్తూ, వారి యొక్క అవసరాన్ని అవకాశం గా తీసుకుని
స్థితి గతులను మారుస్తూ వారి జీవన విధానాన్ని అతలాకుతలం చేస్తున్నారు..
అదిలాబాద్ జిల్లాల్లో
మత మార్పిడి గుట్టు చప్పుడు
కాకుండా సాగుతుంది. వారి అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని మతమార్పిడులను ప్రోత్సహిస్తున్నారు.
ఇటీవల బోథ్ మండలంలోని సోనాల చుట్టుపక్కల ఆదివాసిగూడేలలో వజ్జర్
( కేశవ్ గూడ,మహదు గూడ, జైతూ గూడ,లెండి గూడ)
వంటి ఆదివాసి పల్లెలలో చిన్నపిల్లలకు చాక్లెట్లు,బిస్కెట్లు ఇస్తు,వారి కుటుంబాలకు చేరువవుతూ,వారికి టార్చి లైట్లు,ఇతర ఆర్ధిక అవసరాలను తీరుస్తూ, బోర్లు వేయిస్తూ వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని
గోండి భాషలోకి తర్జుమా చేసిన అన్య మతానికి సంబంధించిన వీడియోలను ప్రొజెక్టర్ ద్వారా చూపిస్తూ, మత ప్రచారం సాగిస్తున్నారు. ఇదంతా దాదాపుగా సంవత్సరం పాటు సాగింది.
ఈ విషయం తెలుసుకున్న స్థానిక యువత, గ్రామస్తులు ఆదివాసి సంఘాలు దృష్టి పెట్టగా అన్యమత ప్రచారకులు వస్తున్నారని తెలుసుకున్న సొనాల,చింతల బోరి యువత ఆదివాసి గ్రామాలకి చేరుకొని ఆదివాసి యువకులతో కలిసి వారిని నిలదీయగా, వారు పొంతన లేని సమాధానాలు
చెప్పడంతో వారి వెహికల్ నీ చూడగా అందులో క్రైస్తవ మత ప్రచార సామగ్రిని గుర్తించి మిగతా ఆదివాసి పల్లెలకు సమాచారం అందించగా వారందరూ కలిసి అన్యమత ప్రచారం చేయడానికి వచ్చిన వారిని వెళ్లగొట్టడమే కాకుండా ఇకనుండి తమ గ్రామాల్లోకి అన్యమత ప్రచారం చేసే వారిని రానివ్వమని గ్రామ పటేల్, ఆదివాసి సంఘాలు నాయకులు తెలిపారు.
ఇలా అనేక గ్రామాల్లో క్రైస్తవ మత ప్రచారం సాగుతూ హిందుత్వం మీద
విషం చిమ్ముతున్నాయి.
ఇకనైనా హిందువులు మేల్కొనకపోతే హిందుత్వం క్రైస్తవ మత ప్రచార కోరల్లో చిక్కుకోవడం మాత్రం నమ్మలేని నిజము.
దేశంలో మత నిరోధక బిల్లు వస్తే తప్ప హిందుత్వం మీద క్రైస్తవుల దాడులను అడ్డుకోవడం కష్టమే మత వ్యాప్తి కోసం ఇతర దేశాల నుండి అధిక మొత్తంలో క్రైస్తవ సంఘాలకు డబ్బు అందుతుంది. దీని ద్వారా విచ్చలవిడిగా అన్యమత ప్రచారం చేస్తూ ముందుకు సాగుతున్నారు.
దేశంలో సాగుతున్న మతమార్పిడులు అరికట్టేందుకు మతమార్పిడి చట్టాన్ని తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉందని కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ గతంలో వ్యాఖ్యానించారు.
బలవంతపు మత మార్పిడి చేయడం చాలా ప్రమాదకరమని, దేశ భద్రత మనసాక్షి, స్వేచ్ఛ పైన ప్రభావం పడవచ్చని కోర్టు పేర్కొంది.
మతమార్పిడి నిరోధక చట్టాలు
అనేక సంవత్సరాలుగా అనేక రాష్ట్రాలు బలవంతంగా మోసం ప్రేరణ ద్వారా జరిగే మతమార్పిడులను నియంత్రించడానికి
మత స్వేచ్ఛ చట్టాన్ని రూపొందించారు. కానీ
మతమార్పిడులు నియంత్రించే చట్టాలు ఎవి లేవు.
1954 నుండి మతమార్పిడిలను నియంత్రించేందుకు అనేక సందర్భాలలో ప్రైవేట్ మెంబర్ల బిల్లులు పార్లమెంట్ లో
ప్రవేశపెట్టినా ఎప్పుడు కూడా ఆమోదించబడలేదు..
బలవంతపు మతమార్పిడులు సమస్యను పరిష్కరించడానికి తీవ్రమైన మరియు చిత్తశుద్ధిగా ప్రయత్నం చేయాలని ఇటీవల సుప్రీంకోర్టు కేంద్రాన్ని కోరింది.
క్రైస్తవ మత ప్రచారం అడ్డుకొని అదేవిధంగా మతనిరోధక బిల్లు దేశం మొత్తం
అమలు కావాల్సిందేనని హిందూ సంఘల నాయకులు
ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
బలవంతపు మతమార్పిళ్ళకు వ్యతిరేకంగా త్వరలో
ఒక చట్టం తేవాలని కేంద్రం నిర్ణయించింది
సుప్రీంకోర్టులో కూడా అఫిడవిట్ దాఖలు చేసింది బలవంతపు మతమార్పిళ్ళను తీవ్రంగా పరిగణిస్తామని త్వరలో దీనిపై చట్టం తీసుకొస్తామని వెల్లడించింది
ఇప్పటికే 9 రాష్ట్రాలలో బలవంతపు మతమార్పిడులకు వ్యతిరేకంగా చట్టాలు తీసుకొచ్చాయి.
అని కేంద్రం
సుప్రీంకోర్టుకు తెలిపింది
కేంద్రం తరఫున కూడా అతి త్వరలో చర్యలు తీసుకుంటామని కూడా వెల్లడించింది
బలవంతపు మతమార్పిడి చట్టాన్ని తీసుకొచ్చిన రాష్ట్రాలు ఒడిస్సా,మధ్యప్రదేశ్,గుజరాత్,ఛత్తీస్ ఘడ్, ఝార్ఖండ్,ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, కర్ణాటక.
కర్ణాటకలో అమలు చేసిన మతమార్పిడి నిరోధక చట్టం ప్రకారం తప్పుడు వివరాలు,
బలవంతము అనుచిత ప్రలోభాలు,
నిర్బంధము లేదా పెళ్లి వంటి
కారణాలతో ఒక మతం వారు మరో మతంలోకి మారడాన్ని ఈ చట్టం నిషేధిస్తుంది. ఈ చట్టం ప్రకారం నేరం పాల్పడినవారికి కనీసం మూడేళ్ల నుంచి ఐదేళ్ల వరకు శిక్ష విధించవచ్చు. అంతేకాకుండా 25 వేల వరకు జరిమానా విధించవచ్చు. ఇకనైనా హిందువులలో చైతన్యం వచ్చి సనాతన
హైందవ ధర్మ రక్షణకి ప్రతి హైందవ సోదరుడు పూనుకోవాలి అని హైందవ సంఘాలు కోరుతున్నాయి.
వ్యాసకర్త :

Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments