రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :
మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో చైతన్య యాత్రను నిర్వహిస్తున్నట్లు మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొండ దేవయ్య పటేల్ అన్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికై మొదటిసారి మంగళవారం ఇచ్చోడకు వచ్చిన నేపథ్యంలో ఆయనతో పాటు మున్నూరు కాపు రాష్ట్ర జర్నలిస్టుల సంఘం కన్వీనర్ కొత్త లక్ష్మణ్ కూ మున్నూరు కాపు సంఘం భవనం లో ఇచ్చోడ మండలం మున్నూరు కాపు సంఘం తరుపున పూల మాలలు, శాలువలతో సత్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు. మున్నూరు కాపుల హక్కుల సాధనకై అందరు పార్టీలకు అతీతంగా ఉంటూ మన కులం ఐక్యతను చాటి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన పేర్కొన్నారు. జనాభా ప్రాతిపదికన రాష్ట్రంలో ఆత్యాధికంగా మున్నూ రు కాపులు రెండవ స్థానంలో ఓట్లు కలిగి ఉన్నారని వివరించారు. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజక వర్గాలో 24 అసెంబ్లీ స్థానాలు మన మున్నరు కాపులకు టికెట్లు కేటాయించాలని, మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటే మన ముందున్న ప్రధాన డిమాండ్ అని స్పష్టం చేశారు. ఈ విషయమై అన్ని ప్రధాన పార్టీల అధినేతలతో సంప్రదిస్తున్నా ని పేర్కొన్నారు. మున్నూరు కార్పొరేషన్ ఏర్పాటు వలన కలిగే లాభాలు, ఉపయోగం గురించి క్లుప్తంగా వివరించారు. చైతన్య యాత్ర తేదీని త్వరలోనే ఖరారు చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమం లో ఇచ్చోడ మండల అధ్యక్షులు ఐదా రాజేశ్వర్, మండల కన్వీనర్ నరాల రమణయ్య, ఎండీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బలగం రవి మండల కో కన్వీనర్ నరాల రాజేశ్వర్, సంఘం నాయకులు షేట్పల్లి రాంరెడ్డి, శంకర్, అంగ రాజేశ్వర్, కొండ హరి ప్రసాద్, గోపుల సత్యనారాయణ, కాగితపు నారాయణ, పాకాల చంటి, గుజరాతీ మల్లికార్జున్, కుస్థపురి రాజేశ్వర్ పాల్గొన్నారు.

Recent Comments