ePaper
Friday, April 24, 2026
📄 ePaper

Adb : పకడ్బందీగా పోలీసు ఎంపిక ప్రక్రియ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి :  జిల్లా ఎస్పీ

📰 Generate e-Paper Clip

 ◾️డిసెంబర్ 8 నుండి 19 వరకు నిర్వహించనున్న శారీరక దేహదారుడ్య పరీక్షలు

 ◾️పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించనున్న శారీరక దేహదారుడ్య పరీక్ష ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి

 ◾️ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి 10,374 మందికి శారీరక దేహదారుద్య పరీక్షలు నిర్వహించేందుకు జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ సర్వం సిద్ధం

రిపబ్లిక్ హిందుస్థాన్, ఉమ్మడి ఆదిలాబాద్ :  ఆదివారం స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు డిసెంబర్ 8వ తారీఖు నుండి ప్రారంభం కానున్న పోలీస్ కానిస్టేబుల్ ఎస్సై లకు సంబంధించిన దేహదారుద్య పరీక్షల ఏర్పాట్లను సంబంధించి జిల్లా ఎస్పి డి ఉదయ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జిల్లా పోలీసు అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ దేహదారుడ్డే పరీక్షలకు సంబంధించి ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఎంపిక ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేస్తున్నట్లు తెలియజేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రం నందు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి 10,374 అభ్యర్థులకు సంబంధించిన శారీరక దేవదారుల పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలియజేశారు. మహిళా అభ్యర్థులకు ప్రత్యేకంగా 10,12 వ తారీకులలో శారీరక దేహదారి పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎక్కడ ఎలాంటి అవకతవకలకు విమర్శలకు తావు లేకుండా శారీరక పరీక్షలు జరిగే మైదానంలో సీసీ కెమెరాలు నిఘా ఉంచుతున్నామని తెలిపారు. అభ్యర్థుల ఎత్తు కొలిచేందుకు డిజిటల్ మీటర్లు ఉపయోగిస్తున్నారని, పురుష అభ్యర్థులకు 1600 మీటర్లు పరుగు కు, మహిళా అభ్యర్థులకు 800 మీటర్ల పరుగు కు ఆర్ ఎఫ్ ఐ డి (రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ రీడర్) కార్డులను ఉపయోగించి అత్యాధునిక పరికరారులతో ఆటోమేటిక్గా సమయాలన్ని రికార్డు నమోదు అయ్యేవిధంగా ఏర్పాట్లు చేశారని తెలిపారు.  అభ్యర్థులు మాత్రమే పరీక్షలకు హాజరు అయ్యే విధంగా ఈసారి నూతనంగా రెస్ట్ బ్యాండ్లను ఉపయోగించన్నున్నట్లు తెలిపారు. షాట్ పుట్ లాంగ్ జంప్ ఈవెంట్స్ ల నందు క్వాలిఫై మేరకు మాత్రమే నమోదు చేయబడుతుందని, పరుగులో మాత్రం అభ్యర్థికి మార్కులను కేటాయించనున్నట్లు తెలిపారు. ఈ వ్యవహారం అంతా ఆన్లైన్ ద్వారా ఎప్పటికప్పుడు రాష్ట్ర పోలీసు నియామక మండలి బోర్డ్ సర్వర్లోకి అప్లోడ్ అవుతుందని తెలిపారు.

ఎంపిక ప్రక్రియలో పాల్గొనే అధికారులకు, సిబ్బందికి ఇప్పటికే ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు అందరి సమక్షంలో రెండు రోజులపాటు ట్రయల్ రన్ నిర్వహించనున్నట్లు తెలిపారు.

ప్రాథమిక రాత పరీక్షలో అర్హత  సాధించిన  అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందులో 8578 మంది పురుషులు, 1796 మంది మహిళ అభ్యర్థులు వున్నారు.  ప్రతి రోజూ 600 నుంచి 1200 మంది వరకు అభ్యర్థులు

హాజరు కానున్నారు. ఉదయం ఐదు గంటలకు పరీక్ష ప్రారంభమవుతుందని, ఇందులో ఉత్తీర్ణలైన వారు తదుపరి  తుది  రాత పరీక్షకు ఎంపికవుతారు. మైదానంలో అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కల్గకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. సర్టిఫికేట్  పరిశీలన నుంచి దేహదారుఢ్య పరీక్షల వరకూ వినూత్న రీతిలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడంతో ఎలాంటి అక్రమాలకు ఆస్కారం లేకుండా పక్కా ప్రణాళికతో నిర్వహించనున్నారు.

 మోసపూరిత మాటలు నమ్మొద్దు

పోలీస్‌ ఎంపిక ప్రక్రియ మొత్తం పారదర్శకంగా కొనసాగుతోందని ఎవరైనా అక్రమ మార్గంలో మేలు చేస్తామని చెబితే నమ్మి మోసపోవద్దని జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రతి అంశం టెక్నాలజీతో ముడిపడి ఉంటుందని, ఎక్కడా మానవ ప్రమేయం ఉండదని అన్నారు. ప్రతి బ్యాచ్‌ ఎంపిక ప్రక్రియ జరిగే సమయంలో ప్రతి అంశం సీసీ కెమెరాల్లో రికార్డు అవుతుందని, తద్వారా దాన్ని భద్రపరుస్తామని తెలిపారు. భవిష్యత్తులో ఏవైనా విమర్శలు వస్తే ఫుటేజీ ఆధారంగా విచారణ చేపడతారని అన్నారు. వేలిముద్రలు తీసుకున్న తర్వాతే అభ్యర్థుల్ని గ్రౌండ్‌లోకి అనుమతిస్తారని, అభ్యర్థులు ఫోన్లు, ఇతర వస్తువులను తీసుకురావద్దని, వాటిని భద్రపరిచేందుకు ఎలాంటి ఏర్పాట్లు ఉండవని అధికారులు తెలిపారు.

పరీక్షలు నిర్వహించే పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ చుట్టూ ఎవరు ఇతరులు ప్రవేశించకుండా పోలీసు సిబ్బంది ద్వారా బందోబస్తు చర్యలను చేపట్టనున్నట్లు తెలిపారు.

కానిస్టేబుల్ మరియు ఎస్.ఐ శారీక దేహదారుఢ్య పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఈ క్రింది సూచనలు తప్పకుండా పాటించాలని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. 👇

 🔹 రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి వారు జారీ చేసిన అనుమతి / సమాచార పత్రం ( admit card / intimation letter ) తమ వెంట తీసుకురావాలి.

 🔹 అభ్యర్థి స్వీయా సంతకముతో కూడిన పార్టు 2 అప్లికేషన్ ఫామ్

 🔹 తమ స్వీయా సంతకాలతో కూడిన కుల ధ్రువీకరణ పత్రం నకలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంచే జారీ చేయబడి ఉండాలి.

 🔹 అభ్యర్థి సీయా సంతకము కలిగిన మాజీ సైనిక దృవ పత్రం ( PPT / డిచార్జీ బుక్ ) /నో అబ్జెక్షన్ సర్టిఫికేటు ( ఇంకా సర్వీసు నుండి డిచార్జీ కానివారికి)

 🔹 అభ్యర్థి స్వీయా సంతకముతో కూడిన ఏజన్సీ ఏరియా సర్టిఫికేటు ఫర్ ఆదివాసి, షెడ్యూల్డు తెగ G.O. MS 24, ట్రైబల్ వెల్ఫేర్ ( LTR 1 )

డిపార్టుమెంటు తేది: 12-06-2018 ప్రకారంగా జారీచేయబడింది.

 🔹 ప్రతీ అభ్యర్థి సి.సి కెమెరాల నిఘాలో ఉంటారు.

 🔹 అభ్యర్థులు వారికి ఉద్దేశించిన తేదీలలో మాత్రమే శారీరక మరియు దేహాదారుఢ్య పరీక్షలకు హాజరు కాగలరు.

 🔹 అభ్యర్థులు పరీక్ష నిర్వాహాణ కేంద్రంలోకి ప్రవేశించిన తరువాత అన్ని రకాల పరీక్షలు ముగిసిన తరువాతనే బయటకు అనుమతిస్తారు. కావున అభ్యర్థులు అందుకు తగిన విధంగా సంసిద్ధులై రాగలరు.

 🔹 అభ్యర్ధులు తమ వెంట దుస్తులు ఆహార పానీయాలు వంటి అత్యవసరమైనవి మినహా ఎటువంటి విలువైన లేదా నిషేదిత వస్తువులు పరీక్ష కేంద్రంలోకి అనుమతించబడవు.

🔹 అభ్యర్థులు ప్రతీ ఈవెంట్ వద్ద మరియు పరిశీలన కేంద్రాల వద్ద ఓర్పుతో ” క్యూ ” పద్ధతిని

పాటించాలి 

🔹 సెల్ఫోన్లు మరియు ఎటువంటి ఎలక్ట్రానిక్స్ వస్తువులు అనుమతించడబవు.

 🔹 మహిళా అభ్యర్థులు తమ వాస్తవిక ఎత్తును ప్రభావితం చేయు ఎలాంటి అభ్యంతరకర శిరోజాలం కరణలు ధరించి పరీక్షకు హాజరుకారాదు.

 🔹 బయోమెట్రిక్ పద్దతిలో అభ్యర్థుల పరిశీలన ఉన్నందున చేతి వేళ్లకు గోరింటాకు లేదా ఇతర

రంగులు వేసుకుని రాకూడదు.

 🔹 పరీక్ష నిర్వాహణలో ప్రతి అభ్యర్థి అధికారుల సూచనలు పాటిస్తూ సహకరించవలెను.

 🔹 సర్టిఫికెట్లకు సంబంధించిన నకలు మాత్రమే తీసుకురావాలని సూచించారు. 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!
https://man2bantul.id/https://portal.man2bantul.id/https://sirekap.man2bantul.id/https://eptsp.man2bantul.id/https://smkn5balam.com/https://tuluskartika.or.id/https://smptk.tuluskartika.or.id/https://www.stai-nurulhidayah.ac.id/https://journal.stai-nurulhidayah.ac.id/https://ejurnal.stai-nurulhidayah.ac.id/https://tical2025.redclara.net/https://uptdselatan.com/masterpoker99masterpoker99masterpoker99poker757poker757
masterpoker99masterpoker99masterpoker99masterpoker99inifun88inifun88inifun88https://jrdindustry.com/inifun88inifun88inifun88inifun88inifun88vovo88vovo88vovo88vovo88vovo88
inifun88inifun 88inifun88 logininipokerini pokerinipoker loginvovo88vovo88vovo88vovo88inifun88inifun88inifun88vovo88