రిపబ్లిక్ హిందుస్థాన్ , ఆదిలాబాద్ : ఇచ్చోడ మండలంలోని ఆడేగామా ( బి) గ్రామంలో భార్య కాపురానికి రావడం లేదని త్రాగుడుకు బానిసై జీవితంపై విరక్తి చెంది ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేసిన యువకుడు రిమ్స్ లో చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. ఇచ్చోడ ఎస్ఐ పి ఉదయ్ కుమార్ మరియు మృతుని తండ్రీ తెలిపిన తెలిపిన వివరాల ప్రకారం.... అడిగామా (బి) గ్రామానికి చెందిన సోన్ కాంబ్లే యశ్వంత్ రావు అనే వ్యక్తికి నలుగురు కూతుళ్లు ఇద్దరు కొడుకులు ఉన్నారు. పెద్దకొడుకు అయిన సొంకాంబ్లీ ధన్ రాజ్( 23) అను అతనికి కెరామేరి మండలంలోని పరంధారి గ్రామానికి చెందిన అనిత అనే యువతి తో గత మూడు సంవత్సరాల క్రితం వివాహం జరిపించారు. రెండు సంవత్సరాల క్రితం ధనరాజ్ భార్య పుట్టింటికి వెళ్లిపోయి తిరిగి రాకపోవడంతో అప్పట్నుండి మద్యానికి బానిసై నిత్యం తాగేవాడు. ఇప్పుడు నా భార్య ఎప్పుడు రాదా అని కలత చెందేవాడు. ఈ నెల 8వ తేదీన తాగిన మైకంలో తన భార్య ఇక ఎప్పుడు కాపురానికి రాదేమో అని రాత్రి రెండు గంటల సమయంలో ప్రాంతంలో ఇంట్లో గుర్తు తెలియని పురుగుల మందు తాగి వాంతులు చేసుకోవడం చూసి యశ్వంత్ రావ్ తమ్ముడు అయినా సొంకాంబ్లీ ప్రకాష్ , పురుగుల మందు తాగి వాంతులు చేసుకుంటున్న విషయం కుటుంబ సభ్యులకు తెలుపగా వెంటనే 108 అంబులెన్స్ లో చికిత్స కోసం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఎక్కడ చికిత్స పొందుతూ చికిత్స పొందుతూ శనివారం రోజు ధన్ రాజ్ మృతి చెందినట్లు తెలిపారు. మృతుని తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments