రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్/జన్నారం :
ఒక కుటుంబాన్ని కులం పేరుతొ దూషించి వారిపై హత్య యత్నం చేసిన నిందితుడి పై నేరం రుజువు కావడం తో శుక్రవారం రోజు నేరస్తుడికి జిల్లా ప్రత్యేక న్యాయస్థానం సాధారణ మూడేళ్ళ జైలు శిక్షను విధించింది.
కేసు పూర్వపరాలు ఇలా ఉన్నాయి….
2018 అక్టోబర్ 19 వ తేదీన షేక్ నయీమ్ అనే ఆటో డ్రైవర్ తన ఆటో తో రాంపూర్ గ్రామానికి వెళ్లి పిర్యాది దానపల్లి మంజుల కుటుంబ సభ్యులను కులం పేరుతో అసభ్యకరంగా తిడుతూ, హత్య ప్రయత్నం చేశాడని బాధితుల ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్ఐ తైసోనోద్దీన్ కేసు నమోదు చేసి అప్పటి ఏసీపీ గౌస్ బాబా పరిశోధన ప్రారంభించి విచారణ చేసి నేరస్తుని అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్ కు పంపించారు. ఆ తరువాత తదుపరి పరిశోధన పూర్తి చేసి కోర్టులో చార్జి షీట్ దాఖలు చేశారు.
అడిషనల్ డిస్టిక్ట్ & సెషన్స్ కోర్ట్ ఆదిలాబాద్ కోర్టులో కేసు విచారణ కొనసాగింది. ఎస్సి, ఎస్టీ కేసుల విచారణ ప్రత్యేక న్యాయమూర్తి ఎం.సతీష్ కుమార్ ఇరువురి వాదనలు విని తదనంతరం శుక్రవారం రోజున నేరస్తును పై అత్యాయత్నం చేసినట్లు రుజువైనందున మూడు సంవత్సరాల సాధారణ జైలు శిక్ష, 5 వేల రూపాయల జరిమానా విధించారు.
*ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ కేసులో…*
ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసులో నేరస్తునికి అరు నెలల సాధారణ జైలు శిక్ష వేయి రూపాయల జరిమానా విధిస్తు తీర్పు వెలువడించారు.
నేరస్తునికి మొత్తం శిక్ష 3 సంవత్సరాల ఆరు నెలల సాధారణ జైలు శిక్ష, ఆరు వేల రూపాయల జరిమానా విధించారు.
ఈ రెండు జైలు శిక్షలు ఏకకాలంలో కొనసాగాలని తీర్పులో వెల్లడించారు.
నేరస్తునికి శిక్ష పడడానికి అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఈ.కిరణ్ కుమార్ రెడ్డి, 16 మంది సాక్షులను ప్రవేశపెట్టి తన వాదనలు వినిపించి నేరాన్ని రుజువు చేయడంలో కీలకపాత్ర పోషించారు. సాక్షులను ప్రవేశపెట్టడానికి సహకరించిన కోర్ట్ లైసెన్ అధికారి సయ్యద్ తాజద్దీన్, లక్షట్ పేట్ సిఐ కరిముల్లా ఖాన్, జన్నారం ఎస్ఐ పి సతీష్, కోర్టు హెడ్ కానిస్టేబుల్ మహమ్మద్ ఇఫ్టేక్వార్ అహ్మద్ లను మంచిర్యాల్ ఏసిపి బి తిరుపతిరెడ్డి, రామగుండం కమిషనర్ ఎస్. చంద్రశేఖర్ రెడ్డి ప్రాసిక్యూషన్ బృందానికి అభినందించారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments