📰 ఆదిలాబాద్ డిఎస్పి వి ఉమేందర్ ఆధ్వర్యంలో జరిగిన కార్డెన్ అండ్ సర్చ్ లో సరైన నిజ ధ్రువపత్రాలు లేని 35 ద్విచక్ర వాహనాలు, రెండు ఆటోలను విచారణ నిమిత్తం స్వాధీనం
📰 సైబర్ క్రైమ్, సీసీటీవీ కెమెరాలు, ఇన్సూరెన్స్, ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించినా డిఎస్పీ
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా పోలీసు యంత్రాంగం అసాంగిక కార్యకలాపాల పై మోపుతోంది. తాజాగా శనివారం సాయంత్రం ఆదిలాబాద్ పట్టణంలోని స్థానిక కేఆర్కే కాలనీ నందు జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు ఆదిలాబాద్ డిఎస్పి వి ఉమేందర్ ఆధ్వర్యంలో కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. కార్డెన్ అండ్ సెర్చ్ లో సరైన నిజ ధ్రువ పత్రాలు లేని 35 ద్విచక్ర వాహనాలు రెండు ఆటోలను విచారణ నిమిత్తం స్వాధీనం చేసుకోవడం జరిగిందని డిఎస్పీ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో డి.ఎస్.పి మాట్లాడుతూ జిల్లాలో వాహనదారులకు ఇన్సూరెన్స్ తప్పనిసరిగా కలిగి ఉండాలని, అదేవిధంగా నేరాలను అదుపు చేయడానికి సీసీటీవీ కెమెరాల ఆవశ్యకత తప్పనిసరి అని, ప్రస్తుత సమాజంలో సైబర్ నేరగాళ్లు అవలంబిస్తున్న తీరును వాటి బారిన పడకుండా ప్రజలకు అవగాహన, ట్రాఫిక్ నియమాలపై మరియు తదితర అంశాలపై ప్రజలకు అవగాహనను కల్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామీణ సీఐ బి రఘుపతి, జైనథ్ సిఐ కె నరేష్ కుమార్, ఎస్సైలు ఏ హరిబాబు, వి విష్ణువర్ధన్, బీ పేర్సెస్, డి రాధిక, 30 మందికి స్పెషల్ పార్టీ పోలీసులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



Recent Comments