🟥 రూ.2 మేర నష్టం పోయిన రైతు
🟥 ప్రభుత్వం ఆదుకోవాలని విన్నపం
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలోని మల్కాపూర్ గ్రామానికి చెందిన ఆదివాసీ రైతు పెందుర్ రాములు కు చెందిన 23 మేకలు గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో మేతకు వెళ్లడంతో శుక్రవారం కురిసిన భారీ వర్షానికి పిడుగు పడడంతో అక్కడికక్కడే మృతి చెందాయి. మేకల కాపర్లకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. మేకలు మాత్రం మృతి చెందాయి. సుమారు వీటి విలువ 2 లక్షల రూపాయలు ఉంటుందని స్థానికులు తెలిపారు. రైతును ప్రభుత్వ ఆదుకోవాలని గ్రామస్తులు, స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మేకలు మృతి చెందడంతో యజమాని రాము ఆయన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు .


Recent Comments