వివిధ దొంగతనాలకు పాల్పడిన దొంగను అరెస్ట్ చేసిన ఉట్నూర్ పోలీసులు. రూ. 300000/- విలువ గల బంగారు ఆభరణాలు మరియు రూ.70000 ల నగదు స్వాధీనము….
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ బ్యూరో : గత కొన్ని నెలలుగా ఉట్నూర్ లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఘరానా దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. చోరీ కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు ముమ్మరంగా కేసు దర్యాప్తు చేసి దొంగను పట్టుకుని, చోరీ సొత్తును దొంగ నుండి స్వాధీనం చేసుకున్నారు. ఉట్నూర్ ఎస్సై భరత్ సుమన్ వెల్లడించిన వివరాల ప్రకారం….. గత కొన్ని నెలల నుండి రాత్రి పూట ఉట్నూర్ గ్రామములో డా. రవూప్, రోహిదాస్ ఏ.ఈ ఇళ్ళలో మరియు చాంద్ మట్టన్ దుకాణం నుండి మేకల దొంగతనములు జరిగిన విషయము లో కేసు నమోదు చేసుకొన్నా ఉట్నూర్ ఎస్సై భరత్ సుమన్ మరియు ఉట్నూర్ సిఐ సైదారావ్ లు ఆదిలాబాద్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి మరియు ఏఎస్పీ ఉట్నూర్ శ్రీ హర్ష వర్ధన్ ఆదేశాల మేరకు స్థానిక సిబ్బంది తో కలిసి ముమ్మరంగా దర్యాప్తు కొనసాగించే క్రమములో గురువారం ఉట్నూర్ ఎక్స్ రోడ్డు గ్రామము వద్ద ఉట్నూర్ పోలీసులు వాహనాలు తనిఖీ నిర్వహిస్తుండగా ఒక వ్యక్తి అనుమానాస్పదంగా పోలీసు వారిని చూసి పారిపోయే క్రమములో పట్టుకొని తమదైనా శైలిలో విచారించగా నిండుతుడు జైనూర్ మండలంలోని లెండి గూడా గ్రామానికి చెందిన అతని పేరు A1) కం రామారావ్ (35) అలియాస్ తుకారామ్ గా పేర్కొన్నట్లు ఎస్సై తెలిపారు. N/o రామ్. నగర్ ఇంద్రవెల్లి, గ్రామం మరియు మండలము. పట్టుకొని అతనినుండి దొంగలించిన రూ.300000 ల విలువ గల బంగారు ఆభరణాలు మరియు రూ.70000ల నగదును నిందితుడి వద్ద నుండి స్వాధీనము చేసుకోవడం జరిగిందని తెలిపారు. పట్టుబడిన నిందితుడి పై పలు పోలీస్ స్టేషన్లలో గతం లో అనేక కేసులు నమోదు ఉన్నట్లు తెలిపారు. నిందితుడు అలవాటు పడిన నేరస్థుడు. A1) కం రామారావ్ (35) అలియాస్ తుకారామ్ పై ఇంతకుముందు ఆదిలాబాద్, మంచిర్యాల్, ఉట్నూర్ లోని వివిధ పోలీసు స్టేషన్ లలో 43 కేసు లు ఉన్నాయి, కేసులలో జైలు కు వెళ్ళి రావడము జర్గిందని అన్నారు. ఇతను 2021 సంవత్సరము చివరలొ లొ జైల్ నుండి విడుదల అవ్వడము జరిగిందని పేర్కొన్నారు.
దొంగతనము చేసిన వ్యక్తి ని పట్టుకోవడములో ప్రతిభా కనబరిచిన ఉట్నూర్ సిఐ సైదారావ్ మరియు ఎస్ఐ బరత్ సుమన్ మరియు సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ నాగన్న, కొండిబా రావ్, లక్ష్మి నారాయణ, అవినాష్ లను ఆదిలాబాద్ జిల్లా ఎస్పి ఉదయ్ కుమార్ రెడ్డి ప్రత్యేకంగా అభినందిచారు.


Recent Comments