Friday, February 7, 2025

ప్రత్తి పంటలో తలమాడు తెగుళ్ళ నివారణ



రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ బ్యూరో :
ప్రస్తుత పరిస్థితులలో ప్రత్తి పంటలో చేయవలసిన యాజమాన్య పద్ధతులు పాటించాలని ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త ( ప్రత్తి ) డా. వి.తిరుమల రావు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం ప్రత్తి పంట 80 – 90 రోజుల దశలో ఉంది . రాష్ట్రంలోని వివిధ జిల్లాలో తలమాడు తెగులు ( టోబాకోస్ట్రీక్ వైరస్ ) పత్తి పంటను ఆశిస్తున్నట్లు గమనించడం జరిగింది . టోబాకోస్టిక్ వైరస్ సోకినా మొక్కలో కొమ్మల చివరి లేత ఆకులు పసుపు వర్ణానికి మారి చిన్నవిగా ఉంటాయి . వ్యాధి సోకినా కొమ్మల్లో ఎదుగుదల ఆగిపోయి గిడసబారుతాయి . వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు వైరస్ వ్యాపించిన కొమ్మలకు ఉన్న మొగ్గలు ఎండి రాలిపోతాయి . ఈ తెగులు ముఖ్యంగా వయ్యారిభామ ( కలుపు మొక్కలు ) పుప్పొడి రేణువుల నుంచి ప్రత్తి మొక్కలకు తామర పురుగుల ద్వారా వ్యాప్తిచెందుతుంది .



ప్రత్తి పంట పొలంలో మరియు గట్ల వెంబడి వుండే వయ్యారిభామ , ఉత్తరేణి , గడ్డి చామంతి వంటి కలుపు మొక్కలను పూతకు రాకముందే పీకి తగలబెట్టడం ఈ రోగ నివారణకు ఏకైక మార్గం . , తామర పురుగులను అరికట్టడం వల్ల ఈ వ్యాధి వ్యాప్తిని కొంత మేరకు నివారించవచ్చును . తామర పురుగుల నివారణకు పిప్రోనిల్ @ 2 మి.లీ. / లీ . ( లేదా ) ధయోమిథాక్సామ్ @ 0.2 గ్రా / లీ . ( లేదా ) స్పైనిటోరమ్ @ 0.9 గ్రా / లీ . నీటికి కలిపి పిచికారి చేయాలి . > కొంత విరామం తర్వాత రాష్ట్రంలో కురుస్తున్న అధిక వర్షాలకు ప్రత్తి పంటలో పారవిల్ట్ గమనించడం జరుగుతోంది . పంట ఎండిపోవడం , ఆకులు ఎర్రని రంగులోకి మారడం పూత , పిందె మరియు కాయలు రాలడం దీని ముఖ్య లక్షణాలు . పంట త్వరగా కోలుకోవడానికి పొలాల నుండి అదనపు / నిల్వ ఉన్న నీటిని బయటకు తీసివేయాలి . వాడిపోయిన మొక్కలను వెంటనే పీకివేయాలి . నివారణకు పాఠావిల్ట్ సోకినా మొక్కల మొదళ్ళు తడిచేల కాపర్ ఆక్సి క్లోరైడ్ @ 3.గ్రా / లీ . నీటికి కలిపి 5-7 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేయాలి . అలాగే పంట త్వరగా కోలుకోవడానికి నీటిలో కరిగే ఎరువులైన మాల్టీ – కే ( 13 : 0 : 45 ) ( లేదా ) యూరియా @ 10 గ్రా . లీటరు నీటికి కలిపి వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు పోషకాలను పంటపై పిచికారి చేయాలి .



అధిక వర్షాలకు ప్రత్తి పంటలో పూత మరియు పిందె రాలకుండా నాప్తలీన్ ఎసిటిక్ యాసిడ్ ( యాన్ . ఎ.ఎ. ) ఎకరానికి 40 మి.లీ. చొప్పున పిచికారి చేసుకోవాలి . అలాగే ప్రత్తిలో బాక్టీరియా నల్ల మచ్చ తెగులు నివారణకు 10 లీటర్ల నీటికి స్టెప్టోసైక్లిన్ ( లేదా ) పౌషామైసిన్ ( లేదా ) ప్లాంటామైసిన్ @ 1 గ్రా . మరియు రాగిధాతు సంబధిత మందులు ( కాపర్ ఆక్సీక్లోరైడ్ ) @ 30 గ్రా . చొప్పున కలిపి పిచికారి చేయాలి . > పచ్చదోమ నివారణకు ప్లోనికమిడ్ @ 0.3 గ్రా / లీ . ( లేదా ) డైనోటిప్యురాన్ @ 0.3 గ్రా / లీ ( లేదా ) ధయోమిథాక్సామ్ @ 0.2 గ్రా / లీ . ( లేదా ) సల్ఫోక్సాప్లోర్ @ 0.6 గ్రా / లీ . నీటికి కలిపి పిచికారి చేయాలి . పేనుబంక నివారణకు ఎసిటమిప్రిడ్ @ 0.2 గ్రా / లీ . ( లేదా ) ఎసిఫేట్ @ 1.5 గ్రా / లీ . నీటికి కలిపి పిచికారి చేయాలి .


Discover more from republichindustan.in

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి
error: Content is protected !!